Genesis · chapter 7 · verse 13
Genesis 7:13 in Telugu
ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.
Aa dinamande novahunu novahu kumaarulagu shemunu haamunu yaapetunu novahu bhaaryayu vaaritokooda atani mugguru kodandrunu aa odalo praveshinchiri.
Genesis 7:13 in English
- King James Version (KJV)
- In the selfsame day entered Noah, and Shem, and Ham, and Japheth, the sons of Noah, and Noah’s wife, and the three wives of his sons with them, into the ark;
- World English Bible (WEB)
- In the same day Noah, and Shem, Ham, and Japheth—the sons of Noah—and Noah’s wife and the three wives of his sons with them, entered into the ship—
- American Standard Version (ASV)
- In the selfsame day entered Noah, and Shem, and Ham, and Japheth, the sons of Noah, and Noah’s wife, and the three wives of his sons with them, into the ark;
- Bible in Basic English (BBE)
- On the same day Noah, with Shem, Ham, and Japheth, his sons, and his wife and his sons' wives, went into the ark;
- Darby Translation (DBY)
- On the same day went Noah, and Shem and Ham and Japheth, the sons of Noah, and Noah's wife, and the three wives of his sons with them, into the ark;
- Webster's Bible (WBS)
- In the same day entered Noah, and Shem, and Ham, and Japheth, the sons of Noah, and Noah's wife, and the three wives of his sons with them, into the ark.
- Young's Literal Translation (YLT)
- In this self-same day went in Noah, and Shem, and Ham, and Japheth, sons of Noah, and Noah's wife and the three wives of his sons with them, unto the ark;
Read in context
- 11నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
- 12నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.
- 13ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.
- 14వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.
- 15జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను.
Cross references
- Genesis 6:18 ఆదికాండము 6:18అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
- Genesis 7:1 ఆదికాండము 7:1యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటి వారును ఓడలో ప్రవేశించుడి.
- Genesis 7:7–9 ఆదికాండము 7:7–9అప్పుడు నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.
- 1 Chronicles 1:4–28 1 దినవృత్తాంతములు 1:4–28నోవహు షేము హాము యాపెతు. యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా. యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము. హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను. కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను. కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు. లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను. యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు అర్కీయులు సీనీయులు అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును హదోరమును ఊజాలును దిక్లానును ఏబాలును అబీమా యేలును షేబను ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ సెరూగు నాహోరు తెరహు అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాహాము కుమారులు, ఇస్సాకు ఇష్మాయేలు.
- 1 Peter 3:20 1 పేతురు 3:20దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి.
- Genesis 5:32 ఆదికాండము 5:32నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
- Genesis 10:21 ఆదికాండము 10:21మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- 2 Peter 2:5 2 పేతురు 2:5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను.
- Genesis 10:6 ఆదికాండము 10:6హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
- Genesis 10:1–2 ఆదికాండము 10:1–2ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపెతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
- Genesis 6:10 ఆదికాండము 6:10షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.
- Genesis 9:18–19 ఆదికాండము 9:18–19ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
Original words (Hebrew)
- selfsame · H6106עֶצֶם ʻetsem
- day · H3117יוֹם yôwm
- entered · H935בּוֹא bôwʼ
- Noah · H5146נֹחַ Nôach
- Shem · H8035שֵׁם Shêm
- Ham · H2526חָם Châm
- Japheth · H3315יֶפֶת Yepheth
- sons · H1121בֵּן bên
- Noah · H5146נֹחַ Nôach
- Noah’s · H5146נֹחַ Nôach
- wife · H802אִשָּׁה ʼishshâh
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- wives · H802אִשָּׁה ʼishshâh
- sons · H1121בֵּן bên
- ark · H8392תֵּבָה têbâh