Isaiah · chapter 19 · verse 17
Isaiah 19:17 in Telugu
యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.
Yoodaadeshamu aiguptunaku bhayankaramagunu tamakuvirodhamugaa sainyamulakadhipatiyagu yehovaa uddeshinchinadaaninibatti okadu prastaapinchinayedala aigupteeyulu vanakuduru.
Isaiah 19:17 in English
- King James Version (KJV)
- And the land of Judah shall be a terror unto Egypt, every one that maketh mention thereof shall be afraid in himself, because of the counsel of the LORD of hosts, which he hath determined against it.
- World English Bible (WEB)
- The land of Judah will become a terror to Egypt. Everyone to whom mention is made of it will be afraid, because of the plans of the LORD of Armies, which he determines against it.
- American Standard Version (ASV)
- And the land of Judah shall become a terror unto Egypt; every one to whom mention is made thereof shall be afraid, because of the purpose of Jehovah of hosts, which he purposeth against it.
- Bible in Basic English (BBE)
- And the land of Judah will become a cause of great fear to Egypt; whenever its name comes to mind, Egypt will be in fear before the Lord of armies because of his purpose against it.
- Darby Translation (DBY)
- And the land of Judah shall be a dismay unto Egypt: every one that thinketh of it shall be afraid for himself, because of the counsel of Jehovah of hosts, which he hath purposed against it.
- Webster's Bible (WBS)
- And the land of Judah shall be a terror to Egypt, every one that maketh mention of it shall be afraid in himself, because of the counsel of the LORD of hosts, which he hath determined against it.
- Young's Literal Translation (YLT)
- And the land of Judah hath been to Egypt for a cause of staggering, Every one who doth mention it, for himself feareth, Because of the counsel of Jehovah of Hosts, That He is counselling against it.
Read in context
- 15తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు
- 16ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.
- 17యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.
- 18ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.
- 19ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.
Cross references
- Isaiah 14:24 యెషయా 14:24సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణ పూర్వ కముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును.
- Daniel 4:35 దానియేలు 4:35భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
- Ezekiel 29:6–7 యెహెజ్కేలు 29:6–7అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను; వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి.
- Isaiah 20:2–5 యెషయా 20:2–5ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెనునీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచు చుండగా యెహోవానా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియై జోడు లేకయే నడచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశమునుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరు లనుగాను చెప్పులు లేనివారినిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదులమీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.
- Jeremiah 25:27–31 యిర్మీయా 25:27–31నీవు వారితో ఈలాగు చెప్పుము ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించు చున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, ఈలాగు చెప్పవలెను ఉన్నత స్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించు చున్నాడు. భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 44:28–30 యిర్మీయా 44:28–30ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు. మీకు కీడు సంభవించు నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించు చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.
- Jeremiah 43:8–13 యిర్మీయా 43:8–13యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయించును. అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతముచేయును. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చి వేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱెలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణము లోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
- Isaiah 14:26–27 యెషయా 14:26–27సర్వలోకమునుగూర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించి యున్నాడు రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడెవడు?
- Isaiah 36:1 యెషయా 36:1హిజ్కియా రాజుయొక్క పదునాలుగవ సంవత్సర మున అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనెను.
- Jeremiah 25:19 యిర్మీయా 25:19మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును
- Isaiah 46:10–11 యెషయా 46:10–11నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. తూర్పునుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశమునుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను ఉద్దేశించియున్నాను సఫలపరచెదను.