Jeremiah · chapter 45 · verse 3
Jeremiah 45:3 in Telugu
కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.
Katakataa, naaku shrama, yehovaa naaku puttinchina noppiki todu aayana naaku duhkhamunu kalugajeyuchunnaadu, moolugucheta alasi yunnaanu, naaku nemmadi dorakadaayenu ani neevanukonu chunnaavu.
Jeremiah 45:3 in English
- King James Version (KJV)
- Thou didst say, Woe is me now! for the LORD hath added grief to my sorrow; I fainted in my sighing, and I find no rest.
- World English Bible (WEB)
- ‘You said, “Woe is me now! For the LORD has added sorrow to my pain! I am weary with my groaning, and I find no rest.”’
- American Standard Version (ASV)
- Thou didst say, Woe is me now! for Jehovah hath added sorrow to my pain; I am weary with my groaning, and I find no rest.
- Bible in Basic English (BBE)
- You said, Sorrow is mine! for the Lord has given me sorrow in addition to my pain; I am tired with the sound of my sorrow, and I get no rest.
- Darby Translation (DBY)
- Thou didst say, Woe unto me! for Jehovah hath added grief to my sorrow; I am weary with my sighing, and I find no rest.
- Webster's Bible (WBS)
- Thou didst say, Woe is me now! for the LORD hath added grief to my sorrow; I fainted in my sighing, and I find no rest.
- Young's Literal Translation (YLT)
- 'Thou hast said, Woe to me, now, for Jehovah hath added sorrow to my pain, I have been wearied with my sighing, and rest I have not found.
Read in context
- 1యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది
- 2బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు
- 3కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసి యున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొను చున్నావు.
- 4నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.
- 5నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- 2 Corinthians 4:16 2 కొరింథీయులకు 4:16కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
- Galatians 6:9 గలతీయులకు 6:9మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
- 2 Corinthians 4:1 2 కొరింథీయులకు 4:1కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము.
- Numbers 11:11–15 సంఖ్యాకాండము 11:11–15కాగా మోషే యెహోవాతో యిట్లనెనునీవేల నీ సేవకుని బాధిం చితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జను లందరి భారమును నామీద పెట్టనేల? నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశ మునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
- Joshua 7:7–9 యెహోషువ 7:7–9అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
- 2 Thessalonians 3:13 2 థెస్సలొనీకయులకు 3:13సహోదరు లారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.
- Jeremiah 15:10–21 యిర్మీయా 15:10–21అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువాని గాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించు చున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుము నైనను కంచునైనను ఎవడైన విరువగలడా? నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసి కొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించె దను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమోచించెదను.
- Lamentations 3:32 విలాపవాక్యములు 3:32ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును.
- Psalm 77:3–4 కీర్తనలు 77:3–4దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా. ) నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
- Genesis 37:34–35 ఆదికాండము 37:34–35యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.
- Genesis 42:36–38 ఆదికాండము 42:36–38అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. అందుకు రూబేను - నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
- Psalm 27:13 కీర్తనలు 27:13సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము