Job · chapter 10 · verse 21
Job 10:21 in Telugu
అంధకారము మరణాంధకారముగల దేశమునకు
Andhakaaramu maranaandhakaaramugala deshamunaku
Job 10:21 in English
- King James Version (KJV)
- Before I go [whence] I shall not return, [even] to the land of darkness and the shadow of death;
- World English Bible (WEB)
- before I go where I will not return from, to the land of darkness and of the shadow of death;
- American Standard Version (ASV)
- Before I go whence I shall not return, [Even] to the land of darkness and of the shadow of death;
- Bible in Basic English (BBE)
- Before I go to the place from which I will not come back, to the land where all is dark and black,
- Darby Translation (DBY)
- Before I go, and never to return, — to the land of darkness and the shadow of death;
- Webster's Bible (WBS)
- Before I go [whence] I shall not return, [even] to the land of darkness, and the shades of death;
- Young's Literal Translation (YLT)
- Before I go, and return not, Unto a land of darkness and death-shade,
Read in context
- 19అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.
- 20నా దినములు కొంచెమే గదాతిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు
- 21అంధకారము మరణాంధకారముగల దేశమునకు
- 22కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకుభ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందుకొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.
Cross references
- 2 Samuel 12:23 2 సమూయేలు 12:23ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉప వాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.
- Job 16:22 యోబు 16:22కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్లుదును.
- Job 3:5 యోబు 3:5చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక. మేఘము దాని కమ్మును గాకపగలును కమ్మునట్టి అంధకారముదాని బెదరించును గాక
- Job 7:8–10 యోబు 7:8–10నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
- Psalm 23:4 కీర్తనలు 23:4గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
- Job 14:10–14 యోబు 14:10–14అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
- 2 Samuel 14:14 2 సమూయేలు 14:14మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.
- Psalm 88:11–12 కీర్తనలు 88:11–12సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?
- Job 3:13 యోబు 3:13లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును
- Psalm 88:6 కీర్తనలు 88:6అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి యున్నావు.
- Jeremiah 2:6 యిర్మీయా 2:6ఐగుప్తుదేశములోనుండి మమ్మును రప్పించిన యెహోవా యెక్కడ నున్నాడని అరణ్యములో అనగా, ఎడారులు, గోతులుగల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి, యెవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా యెక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు.
- Isaiah 38:11 యెషయా 38:11యెహోవాను, సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును. మృతుల లోకనివాసినై ఇకను మనుష్యులను కానక పోవుదునని నేననుకొంటిని.