Job · chapter 11 · verse 12
Job 11:12 in Telugu
అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
Ayite adavi gaadidapilla narudai puttinanaatikigaani buddhiheenudu vivekikaadu.
Job 11:12 in English
- King James Version (KJV)
- For vain man would be wise, though man be born [like] a wild ass’s colt.
- World English Bible (WEB)
- An empty-headed man becomes wise when a man is born as a wild donkey’s colt.
- American Standard Version (ASV)
- But vain man is void of understanding, Yea, man is born [as] a wild ass’s colt.
- Bible in Basic English (BBE)
- And so a hollow-minded man will get wisdom, when a young ass of the field gets teaching.
- Darby Translation (DBY)
- Yet a senseless man will make bold, though man be born [like] the foal of a wild ass.
- Webster's Bible (WBS)
- For vain man would be wise, though man is born [like] a wild ass's colt.
- Young's Literal Translation (YLT)
- And empty man is bold, And the colt of a wild ass man is born.
Read in context
- 10ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యెమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు?
- 11పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదా పరిశీలనచేయక యే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలిసికొనును గదా.
- 12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
- 13నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడల నీ చేతులు ఆయనవైపు చాపినయెడల
- 14పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచిన యెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
Cross references
- Job 39:5–8 యోబు 39:5–8అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- James 2:20 యాకోబు 2:20వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా?
- Psalm 73:22 కీర్తనలు 73:22నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
- Ecclesiastes 3:18 ప్రసంగి 3:18కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని.
- Jeremiah 2:24 యిర్మీయా 2:24అరణ్యమునకు అల వాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురతవలన గాలి పీల్చును, కలిసికొనునప్పుడు దాని త్రిప్పగల వాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి యుండదు, దాని మాసములో అది కనబడును.
- James 3:13–17 యాకోబు 3:13–17మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
- Psalm 92:6 కీర్తనలు 92:6పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
- Job 6:5 యోబు 6:5అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా?
- Psalm 62:9–10 కీర్తనలు 62:9–10అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మికయుంచకుడి దోచుకొనుటచేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.
- Proverbs 30:2–4 సామెతలు 30:2–4నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
- Ephesians 2:3 ఎఫెసీయులకు 2:3వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
- Job 12:2–3 యోబు 12:2–3నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను