Job · chapter 12 · verse 2
Job 12:2 in Telugu
నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
Nijamugaa lokamulo meere janulu meetone jnyaanamu gatinchi povunu.
Job 12:2 in English
- King James Version (KJV)
- No doubt but ye [are] the people, and wisdom shall die with you.
- World English Bible (WEB)
- “No doubt, but you are the people, and wisdom will die with you.
- American Standard Version (ASV)
- No doubt but ye are the people, And wisdom shall die with you.
- Bible in Basic English (BBE)
- No doubt you have knowledge, and wisdom will come to an end with you.
- Darby Translation (DBY)
- Truly ye are the people, and wisdom shall die with you!
- Webster's Bible (WBS)
- No doubt but ye [are] the people, and wisdom shall die with you.
- Young's Literal Translation (YLT)
- Truly — ye [are] the people, And with you doth wisdom die.
Read in context
- 1అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను
- 2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
- 3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- 4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
Cross references
- Isaiah 5:21 యెషయా 5:21తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.
- Job 11:2 యోబు 11:2ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
- 1 Corinthians 4:10 1 కొరింథీయులకు 4:10మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
- Job 15:2 యోబు 15:2జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
- Job 8:8–10 యోబు 8:8–10మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి. మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము. వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
- Job 32:7–13 యోబు 32:7–13వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని; అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు. కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై మీరు చెప్పినవాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని అయితే మీలో ఎవరును యోబును ఖండింపలేదు ఎవరును అతని మాటలకు ప్రత్యుత్తరమియ్యలేదు. కావునమాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరరనియు మీరు పలుకకూడదు.
- Job 6:24–25 యోబు 6:24–25నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము?
- Job 20:3 యోబు 20:3నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
- Job 11:12 యోబు 11:12అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగాని బుద్ధిహీనుడు వివేకికాడు.
- Proverbs 28:11 సామెతలు 28:11ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.
- Job 17:4 యోబు 17:4నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు.
- 1 Corinthians 6:5 1 కొరింథీయులకు 6:5మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా?