Job · chapter 12 · verse 4
Job 12:4 in Telugu
నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
Naa snehituniki apahaasyaaspadamugaa nundavalasi vachchenu. Neetiyu yathaarthatayu galavaadu apahaasyaaspadamugaa nundavalasi vachchenu.
Job 12:4 in English
- King James Version (KJV)
- I am [as] one mocked of his neighbour, who calleth upon God, and he answereth him: the just upright [man is] laughed to scorn.
- World English Bible (WEB)
- I am like one who is a joke to his neighbor, I, who called on God, and he answered. The just, the blameless man is a joke.
- American Standard Version (ASV)
- I am as one that is a laughing-stock to his neighbor, I who called upon God, and he answered: The just, the perfect man is a laughing-stock.
- Bible in Basic English (BBE)
- It seems that I am to be as one who is a cause of laughing to his neighbour, one who makes his prayer to God and is answered! the upright man who has done no wrong is to be made sport of!
- Darby Translation (DBY)
- I am to be one that is a derision to his friend, I who call upon God, and whom he will answer: a derision is the just upright [man].
- Webster's Bible (WBS)
- I am [as] one mocked by his neighbor, who calleth upon God, and he answereth him: the just upright [man is] derided.
- Young's Literal Translation (YLT)
- A laughter to his friend I am: 'He calleth to God, and He answereth him,' A laughter [is] the perfect righteous one.
Read in context
- 2నిజముగా లోకములో మీరే జనులు మీతోనే జ్ఞానము గతించి పోవును.
- 3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- 4నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.
- 5దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమను కొందురు. కాలుజారు వారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది.
- 6దోపిడిగాండ్ర కాపురములు వర్థిల్లును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు.
Cross references
- Job 30:1 యోబు 30:1ఇప్పుడైతే నాకన్న తక్కువ వయస్సుగలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగనివారని నేను తలంచియుంటిని.
- Psalm 91:15 కీర్తనలు 91:15అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
- Job 21:3 యోబు 21:3నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదను నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును.
- Job 17:6 యోబు 17:6ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసి యున్నాడునలుగురు నా ముఖముమీద ఉమ్మివేయుదురు.
- Job 17:2 యోబు 17:2ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.
- Psalm 22:7–8 కీర్తనలు 22:7–8నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవామీద నీ భారము మోపుము ఆయన వానిని విడిపించునేమోవాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వానిని తప్పించు నేమో అందురు.
- Job 16:10 యోబు 16:10జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు
- Jeremiah 33:3 యిర్మీయా 33:3నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
- Mark 5:40 మార్కు 5:40అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి
- Job 11:3 యోబు 11:3నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
- Job 16:20 యోబు 16:20నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరునివిషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు
- Matthew 27:29 మత్తయి 27:29ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూని యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి