Job · chapter 13 · verse 2
Job 13:2 in Telugu
మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
Meeku telisinadi naakunu teliseyunnadi nenu meekante takkuva jnyaanamugalavaadanu kaanu.
Job 13:2 in English
- King James Version (KJV)
- What ye know, [the same] do I know also: I [am] not inferior unto you.
- World English Bible (WEB)
- What you know, I know also. I am not inferior to you.
- American Standard Version (ASV)
- What ye know, [the same] do I know also: I am not inferior unto you.
- Bible in Basic English (BBE)
- The same things are in my mind as in yours; I am equal to you.
- Darby Translation (DBY)
- What ye know, I know also: I am not inferior to you.
- Webster's Bible (WBS)
- What ye know, [the same] do I know also: I [am] not inferior to you.
- Young's Literal Translation (YLT)
- According to your knowledge I have known — also I. I am not fallen more than you.
Read in context
- 1ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నా చెవి దాని విని గ్రహించియున్నది
- 2మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
- 3నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నాను దేవునితోనే వాదింప గోరుచున్నాను
- 4మీరైతే అబద్ధములు కల్పించువారు. మీరందరు పనికిమాలిన వైద్యులు.
Cross references
- Job 12:3 యోబు 12:3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- Job 42:7 యోబు 42:7యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది
- 2 Corinthians 11:16–18 2 కొరింథీయులకు 11:16–18నేను అవివేకినని యెవడును తలంచవద్దని మరల చెప్పు చున్నాను. అట్లు తలంచినయెడల నేను కొంచెము అతిశయపడునట్లు నన్ను అవివేకినైనట్టు గానే చేర్చు కొనుడి. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకివలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును.
- 2 Corinthians 12:11 2 కొరింథీయులకు 12:11నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను.
- Job 37:2 యోబు 37:2ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి.
- 2 Corinthians 11:4–5 2 కొరింథీయులకు 11:4–5ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీ కరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.
- 1 Corinthians 8:1–2 1 కొరింథీయులకు 8:1–2విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
- Job 40:4–5 యోబు 40:4–5చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకను.
- Job 35:16 యోబు 35:16నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.
- Job 34:35 యోబు 34:35యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
- Job 15:8–9 యోబు 15:8–9నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు? మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?