Job · chapter 19 · verse 20
Job 19:20 in Telugu
నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది
Naa yemukalu naa charmamutonu naa maansamutonu antukoni yunnavi dantamula asthicharmamu maatramu naaku migilimpabadi yunnadi
Job 19:20 in English
- King James Version (KJV)
- My bone cleaveth to my skin and to my flesh, and I am escaped with the skin of my teeth.
- World English Bible (WEB)
- My bones stick to my skin and to my flesh. I have escaped by the skin of my teeth.
- American Standard Version (ASV)
- My bone cleaveth to my skin and to my flesh, And I am escaped with the skin of my teeth.
- Bible in Basic English (BBE)
- My bones are joined to my skin, and I have got away with my flesh in my teeth.
- Darby Translation (DBY)
- My bones cleave to my skin and to my flesh, and I am escaped with the skin of my teeth.
- Webster's Bible (WBS)
- My bone cleaveth to my skin and to my flesh, and I have escaped with the skin of my teeth.
- Young's Literal Translation (YLT)
- To my skin and to my flesh Cleaved hath my bone, And I deliver myself with the skin of my teeth.
Read in context
- 18చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచినయెడల బాలురు నామీద దూషణలు పలికెదరు.
- 19నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
- 20నా యెముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని యున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది
- 21దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
- 22నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు?
Cross references
- Psalm 102:5 కీర్తనలు 102:5నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి.
- Lamentations 4:8 విలాపవాక్యములు 4:8అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
- Job 33:19–22 యోబు 33:19–22వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొనివచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.
- Psalm 22:14–17 కీర్తనలు 22:14–17నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవినా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది. నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారువారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు
- Job 7:5 యోబు 7:5నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది.
- Lamentations 3:4 విలాపవాక్యములు 3:4ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
- Psalm 38:3 కీర్తనలు 38:3నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
- Job 30:30 యోబు 30:30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- Job 2:4–6 యోబు 2:4–6అపవాదిచర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.
- Psalm 32:3–4 కీర్తనలు 32:3–4నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. )
- Psalm 102:3 కీర్తనలు 102:3పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
- Lamentations 5:10 విలాపవాక్యములు 5:10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.