Job · chapter 21 · verse 27
Job 21:27 in Telugu
మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
Mee talampulu nenerugudunu meeru naameeda anyaayamugaa pannuchunna pannaagamulu naaku telisinavi.
Job 21:27 in English
- King James Version (KJV)
- Behold, I know your thoughts, and the devices [which] ye wrongfully imagine against me.
- World English Bible (WEB)
- “Behold, I know your thoughts, the plans with which you would wrong me.
- American Standard Version (ASV)
- Behold, I know your thoughts, And the devices wherewith ye would wrong me.
- Bible in Basic English (BBE)
- See, I am conscious of your thoughts, and of your violent purposes against me;
- Darby Translation (DBY)
- Lo, I know your thoughts, and the devices ye wrongfully imagine against me.
- Webster's Bible (WBS)
- Behold, I know your thoughts, and the devices [which] ye wrongfully imagine against me.
- Young's Literal Translation (YLT)
- Lo, I have known your thoughts, And the devices against me ye do wrongfully.
Read in context
- 25వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖము గలవాడై మృతినొందును.
- 26వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.
- 27మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
- 28అధిపతుల మందిరము ఎక్కడ నున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
- 29దేశమున సంచరించు వారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?
Cross references
- Luke 5:22 లూకా 5:22యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?
- Psalm 119:86 కీర్తనలు 119:86నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.
- Psalm 59:4 కీర్తనలు 59:4నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగు లెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము.
- Job 42:7 యోబు 42:7యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది
- Job 8:3–6 యోబు 8:3–6దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
- 1 Peter 2:19 1 పేతురు 2:19ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును.
- Job 20:29 యోబు 20:29ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.
- Job 32:3 యోబు 32:3మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపి నందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
- Job 20:5 యోబు 20:5ఆది నుండి నరులు భూమిమీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా?
- Job 15:20–35 యోబు 15:20–35తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడు బాధనొందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు. తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును. శ్రమయు వేదనయు వానిని బెదరించును. యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును. మూర్ఖుడై ఆయనను మార్కొనును తన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కల పైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి. అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని యిండ్లలో దిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు. వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు. వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయిన వారుమాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
- Job 4:8–11 యోబు 4:8–11నేను చూచినంతవరకు అక్రమమును దున్నికీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురుఆయన కోపాగ్ని శ్వాసమువలన వారు లేక పోవుదురు. సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.
- Job 5:3–5 యోబు 5:3–5మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు. ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి