Job · chapter 24 · verse 1
Job 24:1 in Telugu
సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
Sarvashaktudaguvaadu niyaamakakaalamulanu enduku erpaatucheyadu? Aayana nerigiyunnavaaru aayana dinamulanu endu cheta choodakunnaaru?
Job 24:1 in English
- King James Version (KJV)
- Why, seeing times are not hidden from the Almighty, do they that know him not see his days?
- World English Bible (WEB)
- “Why aren’t times laid up by the Almighty? Why don’t those who know him see his days?
- American Standard Version (ASV)
- Why are times not laid up by the Almighty? And why do not they that know him see his days?
- Bible in Basic English (BBE)
- Why are times not stored up by the Ruler of all, and why do those who have knowledge of him not see his days?
- Darby Translation (DBY)
- Why are not times treasured up with the Almighty? why do not they that know him see his days?
- Webster's Bible (WBS)
- Why, seeing times [are] not hid from the Almighty, do they that know him not see his days?
- Young's Literal Translation (YLT)
- Wherefore from the Mighty One Times have not been hidden, And those knowing Him have not seen His days.
Read in context
- 1సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటుచేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
- 2సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
- 3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
Cross references
- Acts 1:7 అపొస్తలుల కార్యములు 1:7కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.
- Ecclesiastes 3:17 ప్రసంగి 3:17ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
- 2 Peter 3:7–8 2 పేతురు 3:7–8అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.
- Ecclesiastes 8:6–7 ప్రసంగి 8:6–7ప్రతి సంగ తిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది; లేనియెడల మనుష్యులుచేయు కీడు బహు భారమగును. సంభవింప బోవునది నరులకు తెలియదు; అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయువారెవరు?
- Psalm 36:10 కీర్తనలు 36:10నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.
- Psalm 73:16–19 కీర్తనలు 73:16–19అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
- Matthew 24:38 మత్తయి 24:38జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి
- Luke 21:22–24 లూకా 21:22–24లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెర వేరుటకై అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.
- Acts 17:26 అపొస్తలుల కార్యములు 17:26మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
- Daniel 2:21 దానియేలు 2:21ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.
- Genesis 18:17 ఆదికాండము 18:17అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
- Genesis 18:20–21 ఆదికాండము 18:20–21మరియు యెహోవా సొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.