Job · chapter 24 · verse 19
Job 24:19 in Telugu
అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.
Anaavrushtichetanu ushnamuchetanu manchu neellu egasi povunatlu paataalamu paapamuchesinavaarini pattukonunu.
Job 24:19 in English
- King James Version (KJV)
- Drought and heat consume the snow waters: [so doth] the grave [those which] have sinned.
- World English Bible (WEB)
- Drought and heat consume the snow waters, so does Sheol those who have sinned.
- American Standard Version (ASV)
- Drought and heat consume the snow waters: [So doth] Sheol [those that] have sinned.
- Bible in Basic English (BBE)
- Snow waters become dry with the heat: so do sinners go down into the underworld.
- Darby Translation (DBY)
- Drought and heat consume snow waters; so doth Sheol those that have sinned.
- Webster's Bible (WBS)
- Drouth and heat consume the snow-waters: [so doth] the grave [those who] have sinned.
- Young's Literal Translation (YLT)
- Drought — also heat — consume snow-waters, Sheol [those who] have sinned.
Read in context
- 17వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
- 18జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురువారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తము ద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.
- 19అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.
- 20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
- 21వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలుచేయరు.
Cross references
- Psalm 49:14 కీర్తనలు 49:14వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసములేనివై పాతాళములో క్షయమైపోవును.
- Luke 16:22 లూకా 16:22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
- Proverbs 14:32 సామెతలు 14:32అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- Job 21:13 యోబు 21:13వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
- Luke 12:20 లూకా 12:20అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
- Psalm 68:2 కీర్తనలు 68:2పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
- Ecclesiastes 9:4–6 ప్రసంగి 9:4–6బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.
- Job 6:15–17 యోబు 6:15–17నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
- Job 21:23 యోబు 21:23ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను
- Job 21:32–34 యోబు 21:32–34వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలికాయబడును పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చ జూచెదరు?
- Psalm 58:8–9 కీర్తనలు 58:8–9వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు. మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు,