Job · chapter 29 · verse 25
Job 29:25 in Telugu
నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
Nenu vaariki peddanai koorchundi vaariki maargamulanu erparachitini senalo raajuvalenu duhkhinchuvaarini odaarchuvaanivalenu nenuntini.
Job 29:25 in English
- King James Version (KJV)
- I chose out their way, and sat chief, and dwelt as a king in the army, as one [that] comforteth the mourners.
- World English Bible (WEB)
- I chose out their way, and sat as chief. I lived as a king in the army, as one who comforts the mourners.
- American Standard Version (ASV)
- I chose out their way, and sat [as] chief, And dwelt as a king in the army, As one that comforteth the mourners.
- Bible in Basic English (BBE)
- I took my place as a chief, guiding them on their way, and I was as a king among his army. ...
- Darby Translation (DBY)
- I chose their way, and sat as chief, and dwelt as a king in the army, as one that comforteth mourners.
- Webster's Bible (WBS)
- I chose out their way, and sat chief, and dwelt as a king in the army, as one [that] comforteth the mourners.
- Young's Literal Translation (YLT)
- I choose their way, and sit head, And I dwell as a king in a troop, When mourners he doth comfort.
Read in context
- 23వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.
- 24వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.
- 25నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
Cross references
- 2 Corinthians 1:3–4 2 కొరింథీయులకు 1:3–4కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.
- 1 Thessalonians 3:2–3 1 థెస్సలొనీకయులకు 3:2–3యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరి చారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును;
- Genesis 41:40 ఆదికాండము 41:40నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులై యుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.
- Isaiah 61:1–3 యెషయా 61:1–3ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
- Isaiah 35:3–4 యెషయా 35:3–4సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును.
- Judges 11:8 న్యాయాధిపతులు 11:8అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితివిు; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి.
- Genesis 14:14–17 ఆదికాండము 14:14–17అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.
- Job 31:37 యోబు 31:37నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయన యొద్దకు వెళ్లెదను.
- Job 4:3–4 యోబు 4:3–4అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.
- Job 1:3 యోబు 1:3అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.
- 2 Corinthians 7:5–7 2 కొరింథీయులకు 7:5–7మేము మాసిదోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను; వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. తీతు రాకవలనమాత్రమే కాకుండ, అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణవలన కూడ మమ్మును ఆదరించెను గనుక నేను మరి ఎక్కువగ సంతోషించితిని.
- 1 Chronicles 13:1–4 1 దినవృత్తాంతములు 13:1–4దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతో కూడుకొనునట్లు వారియొద్దకు పంపి మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొనివత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆ ప్రకారము చేయుదుమనిరి.