Job · chapter 31 · verse 30
Job 31:30 in Telugu
నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
Nenaalaagu cheyaledu, atani praanamunu nenu shapinchaledu paapamucheyutaku naa notiki nenu chotiyyane ledu.
Job 31:30 in English
- King James Version (KJV)
- Neither have I suffered my mouth to sin by wishing a curse to his soul.
- World English Bible (WEB)
- (I have certainly not allowed my mouth to sin by asking his life with a curse);
- American Standard Version (ASV)
- (Yea, I have not suffered my mouth to sin By asking his life with a curse);
- Bible in Basic English (BBE)
- (For I did not let my mouth give way to sin, in putting a curse on his life;)
- Darby Translation (DBY)
- (Neither have I suffered my mouth to sin by asking his life with a curse;)
- Webster's Bible (WBS)
- Neither have I suffered my mouth to sin by wishing a curse to his soul.
- Young's Literal Translation (YLT)
- Yea, I have not suffered my mouth to sin, To ask with an oath his life.
Read in context
- 28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.
- 29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
- 30నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.
- 31అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
- 32పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.
Cross references
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Romans 12:14 రోమీయులకు 12:14మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.
- 1 Peter 2:22–23 1 పేతురు 2:22–23ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- James 3:9–10 యాకోబు 3:9–10దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
- Matthew 5:22 మత్తయి 5:22నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
- Exodus 23:4–5 నిర్గమకాండము 23:4–5నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.
- Matthew 5:43–44 మత్తయి 5:43–44నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా; నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
- James 3:6 యాకోబు 3:6నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
- Ecclesiastes 5:2 ప్రసంగి 5:2నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.
- Ecclesiastes 5:6 ప్రసంగి 5:6నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?
- Matthew 12:36 మత్తయి 12:36నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.