Psalms · chapter 94 · verse 12
Psalm 94:12 in Telugu
యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
Yehovaa, neevu shikshinchuvaadu nee dharmashaastramunu batti neevu bodhinchuvaadu dhanyudu.
Psalm 94:12 in English
- King James Version (KJV)
- Blessed [is] the man whom thou chastenest, O LORD, and teachest him out of thy law;
- World English Bible (WEB)
- Blessed is the man whom you discipline, LORD, and teach out of your law,
- American Standard Version (ASV)
- Blessed is the man whom thou chastenest, O Jehovah, And teachest out of thy law;
- Bible in Basic English (BBE)
- Happy is the man who is guided by you, O Jah, and to whom you give teaching out of your law;
- Darby Translation (DBY)
- Blessed is the man whom thou chastenest, O Jah, and whom thou teachest out of thy law;
- Webster's Bible (WBS)
- Blessed [is] the man whom thou chastenest, O LORD, and teachest him out of thy law;
- Young's Literal Translation (YLT)
- O the happiness of the man Whom Thou instructest, O Jah, And out of Thy law teachest him,
Read in context
- 10అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
- 11నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
- 12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
- 13భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.
- 14యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
Cross references
- Proverbs 3:11–12 సామెతలు 3:11–12నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
- Job 5:17 యోబు 5:17దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.
- 1 Corinthians 11:32 1 కొరింథీయులకు 11:32మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.
- Hebrews 12:5–11 హెబ్రీయులకు 12:5–11మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Psalm 119:71 కీర్తనలు 119:71నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
- Psalm 119:67 కీర్తనలు 119:67శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.
- Deuteronomy 8:5 ద్వితీయోపదేశకాండము 8:5ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని
- Job 33:16–25 యోబు 33:16–25నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొనివచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
- Micah 6:9 మీకా 6:9ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయు చున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి