Job · chapter 9 · verse 16
Job 9:16 in Telugu
నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
Nenu morrapettinappudu aayana naakuttaramichchinanu aayana naa maata aalakinchenani nenu nammajaalanu.
Job 9:16 in English
- King James Version (KJV)
- If I had called, and he had answered me; [yet] would I not believe that he had hearkened unto my voice.
- World English Bible (WEB)
- If I had called, and he had answered me, yet I wouldn’t believe that he listened to my voice.
- American Standard Version (ASV)
- If I had called, and he had answered me, Yet would I not believe that he hearkened unto my voice.
- Bible in Basic English (BBE)
- If I had sent for him to be present, and he had come, I would have no faith that he would give ear to my voice.
- Darby Translation (DBY)
- If I had called, and he had answered me, I would not believe that he hearkened to my voice, —
- Webster's Bible (WBS)
- If I had called, and he had answered me; [yet] I would not believe that he had hearkened to my voice.
- Young's Literal Translation (YLT)
- Though I had called and He answereth me, I do not believe that He giveth ear [to] my voice.
Read in context
- 14కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచు సరియైన మాటలు పలుకుటకు నేనేపాటివాడను?
- 15నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును.
- 16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
- 17ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టు చున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
- 18ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు చేదైనవాటిని నాకు తినిపించును.
Cross references
- Psalm 66:18–20 కీర్తనలు 66:18–20నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి యున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
- Psalm 126:1 కీర్తనలు 126:1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
- Psalm 18:6 కీర్తనలు 18:6నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను.
- Psalm 116:1–2 కీర్తనలు 116:1–2యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- Exodus 6:9 నిర్గమకాండము 6:9మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి.
- Judges 6:13 న్యాయాధిపతులు 6:13గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
- Acts 12:14–16 అపొస్తలుల కార్యములు 12:14–16ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెతికొని పోయిపేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.
- Job 29:24 యోబు 29:24వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.
- Luke 24:41 లూకా 24:41అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.