Leviticus · chapter 25 · verse 36
Leviticus 25:36 in Telugu
నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
Nee devuniki bhayapadi vaaniyodda vaddinainanu teesi konakoodadu; nee sahodarudu neevalana bradukavalenu.
Leviticus 25:36 in English
- King James Version (KJV)
- Take thou no usury of him, or increase: but fear thy God; that thy brother may live with thee.
- World English Bible (WEB)
- Take no interest from him or profit; but fear your God, that your brother may live among you.
- American Standard Version (ASV)
- Take thou no interest of him or increase, but fear thy God; that thy brother may live with thee.
- Bible in Basic English (BBE)
- Take no interest from him, in money or in goods, but have the fear of your God before you, and let your brother make a living among you.
- Darby Translation (DBY)
- Thou shalt take no usury nor increase of him; and thou shalt fear thy God; that thy brother may live beside thee.
- Webster's Bible (WBS)
- Take thou no interest of him, or increase; but fear thy God; that thy brother may live with thee.
- Young's Literal Translation (YLT)
- thou takest no usury from him, or increase; and thou hast been afraid of thy God; and thy brother hath lived with thee;
Read in context
- 34వారు తమ పట్టణ ముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
- 35పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.
- 36నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.
- 37నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.
- 38నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
Cross references
- Exodus 22:25 నిర్గమకాండము 22:25నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింప కూడదు, వానికి వడ్డికట్టకూడదు.
- Deuteronomy 23:19–20 ద్వితీయోపదేశకాండము 23:19–20నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు. అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
- Ezekiel 18:8 యెహెజ్కేలు 18:8వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి
- Leviticus 25:17 లేవీయకాండము 25:17మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.
- Ezekiel 18:17 యెహెజ్కేలు 18:17బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.
- Ezekiel 18:13 యెహెజ్కేలు 18:13అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.
- Psalm 15:5 కీర్తనలు 15:5తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.
- Nehemiah 5:15 నెహెమ్యా 5:15అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.
- Nehemiah 5:7–10 నెహెమ్యా 5:7–10అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించిమీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితివిు, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి. మరియు నేనుమీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా? నేనును నా బంధువులును నా దాసులునుకూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితివిు; ఆ అప్పు పుచ్చుకొనకుందము.
- Ezekiel 22:12 యెహెజ్కేలు 22:12నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- Proverbs 28:8 సామెతలు 28:8వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.