Luke · chapter 11 · verse 15
Luke 11:15 in Telugu
అయితే వారిలో కొందరువీడు దయ్యములకు అధిపతి యైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నా డని చెప్పుకొనిరి.
Ayite vaarilo kondaruveedu dayyamulaku adhipati yaina bayeljebooluvalana dayyamulanu vellagottuchunnaa dani cheppukoniri.
Luke 11:15 in English
- King James Version (KJV)
- But some of them said, He casteth out devils through Beelzebub the chief of the devils.
- World English Bible (WEB)
- But some of them said, “He casts out demons by Beelzebul, the prince of the demons.”
- American Standard Version (ASV)
- But some of them said, By Beelzebub the prince of the demons casteth he out demons.
- Bible in Basic English (BBE)
- But some of them said, He sends out evil spirits by Beelzebul, the ruler of evil spirits.
- Darby Translation (DBY)
- But some from among them said, By Beelzebub the prince of the demons casts he out demons.
- Webster's Bible (WBS)
- But some of them said, He casteth out demons through Beelzebub, the chief of the demons.
- Young's Literal Translation (YLT)
- and certain of them said, 'By Beelzeboul, ruler of the demons, he doth cast forth the demons;'
Read in context
- 13పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయ ముగా అనుగ్రహించుననెను.
- 14ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
- 15అయితే వారిలో కొందరువీడు దయ్యములకు అధిపతి యైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నా డని చెప్పుకొనిరి.
- 16మరికొందరు ఆయనను శోధించుచుపరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.
- 17ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.
Cross references
- Matthew 9:34 మత్తయి 9:34అయితే పరిసయ్యులు ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
- John 10:20 యోహాను 10:20వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
- John 8:48 యోహాను 8:48అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
- Mark 3:22–30 మార్కు 3:22–30యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినయెడల, ఆ రాజ్యము నిలువనేరదు. ఒక యిల్లు తనుకుతానే విరోధముగా వేరు పడిన యెడల, ఆ యిల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువ లేక కడతేరును. ఒకడు బలవంతుడైనవానిని మొదట బంధించితేనే తప్ప, ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించిన యెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.
- Luke 11:18–19 లూకా 11:18–19సాతానును తనకు వ్యతిరేక ముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.
- Matthew 10:25 మత్తయి 10:25శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
- John 8:52 యోహాను 8:52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
- Matthew 12:24–30 మత్తయి 12:24–30పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు. సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు. దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.
- John 7:20 యోహాను 7:20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా