Luke · chapter 19 · verse 5
Luke 19:5 in Telugu
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
Yesu aa chotiki vachchinappudu, kannuletti choochi jakkayyaa tvaragaa digumu, nedu nenu nee yinta nundavalasiyunnadani atanito cheppagaa
Luke 19:5 in English
- King James Version (KJV)
- And when Jesus came to the place, he looked up, and saw him, and said unto him, Zacchæus, make haste, and come down; for to day I must abide at thy house.
- World English Bible (WEB)
- When Jesus came to the place, he looked up and saw him, and said to him, “Zacchaeus, hurry and come down, for today I must stay at your house.”
- American Standard Version (ASV)
- And when Jesus came to the place, he looked up, and said unto him, Zacchæus, make haste, and come down; for to-day I must abide at thy house.
- Bible in Basic English (BBE)
- And when Jesus came to the place, looking up, he said to him, Zacchaeus, be quick and come down, for I am coming to your house today.
- Darby Translation (DBY)
- And when he came up to the place, Jesus looked up and saw him, and said to him, Zacchaeus, make haste and come down, for to-day I must remain in thy house.
- Webster's Bible (WBS)
- And when Jesus came to the place, he looked up, and saw him, and said to him, Zaccheus, make haste, and come down: for to-day I must abide at thy house.
- Young's Literal Translation (YLT)
- And as Jesus came up to the place, having looked up, he saw him, and said unto him, 'Zaccheus, having hastened, come down, for to-day in thy house it behoveth me to remain;'
Read in context
- 3యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను.
- 4అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను.
- 5యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
- 6అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
- 7అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
Cross references
- Revelation 3:20 ప్రకటన 3:20ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
- John 14:23 యోహాను 14:23యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.
- Ezekiel 16:6 యెహెజ్కేలు 16:6అయితే నేను నీ యొద్దకు వచ్చి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రదుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రదుకుమని నీతో చెప్పితిని.
- Hebrews 13:2 హెబ్రీయులకు 13:2ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
- Ephesians 3:17 ఎఫెసీయులకు 3:17తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,
- Psalm 139:1–3 కీర్తనలు 139:1–3యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
- Luke 19:10 లూకా 19:10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
- Genesis 18:3–5 ఆదికాండము 18:3–5ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా
- John 4:7–10 యోహాను 4:7–10సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను.
- John 1:48 యోహాను 1:48నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
- Psalm 101:2–3 కీర్తనలు 101:2–3నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నాయొద్దకు వచ్చెదవు? నా యింట యథార్థహృదయముతో నడుచుకొందును నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచు కొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను
- Ecclesiastes 9:10 ప్రసంగి 9:10చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.