Luke · chapter 24 · verse 6
Luke 24:6 in Telugu
ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు
Aayana ikkadaledu, aayana lechiyunnaadu; aayana inka galilayalo undi nappudu
Luke 24:6 in English
- King James Version (KJV)
- He is not here, but is risen: remember how he spake unto you when he was yet in Galilee,
- World English Bible (WEB)
- He isn’t here, but is risen. Remember what he told you when he was still in Galilee,
- American Standard Version (ASV)
- He is not here, but is risen: remember how he spake unto you when he was yet in Galilee,
- Bible in Basic English (BBE)
- He is not here, he has come back to life: have in mind what he said to you when he was still in Galilee, saying,
- Darby Translation (DBY)
- He is not here, but is risen: remember how he spoke to you, being yet in Galilee,
- Webster's Bible (WBS)
- He is not here, but is risen. Remember how he spoke to you when he was yet in Galilee,
- Young's Literal Translation (YLT)
- he is not here, but was raised; remember how he spake to you, being yet in Galilee,
Read in context
- 4ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
- 5వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
- 6ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు
- 7మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో
- 8అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని
Cross references
- Matthew 17:22–23 మత్తయి 17:22–23వారు గలిలయలో సంచరించుచుండగా యేసుమనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవు చున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.
- Luke 9:22 లూకా 9:22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దల చేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్య మని చెప్పెను.
- Mark 8:31 మార్కు 8:31మరియు మనుష్యకుమారుడు అనేక హింసలుపొంది, పెద్దల చేతను ప్రధానయాజకుల చేతను శాస్త్రులచేతను ఉపేక్షింప బడి చంపబడి, మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప నారంభించెను.
- Matthew 28:6 మత్తయి 28:6ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి
- Luke 9:44 లూకా 9:44ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను.
- Matthew 27:63 మత్తయి 27:63అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.
- Mark 10:33–34 మార్కు 10:33–34ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
- Matthew 20:18–19 మత్తయి 20:18–19ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించు టకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవ దినమున ఆయన మరల లేచును.
- Mark 9:30–32 మార్కు 9:30–32వారక్కడనుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్లు చుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేక పోయెను; ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడు చున్నాడు, వారాయనను చంపెదరు; చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
- Matthew 16:21 మత్తయి 16:21అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లిపెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా
- Matthew 12:40 మత్తయి 12:40యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
- Luke 24:44–46 లూకా 24:44–46అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు