Luke · chapter 9 · verse 55
Luke 9:55 in Telugu
ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
Aayana vaaritattu tirigi vaarini gaddinchenu.
Luke 9:55 in English
- King James Version (KJV)
- But he turned, and rebuked them, and said, Ye know not what manner of spirit ye are of.
- World English Bible (WEB)
- But he turned and rebuked them, “You don’t know of what kind of spirit you are.
- American Standard Version (ASV)
- But he turned, and rebuked them.
- Bible in Basic English (BBE)
- But turning round he said sharp words to them.
- Darby Translation (DBY)
- But turning he rebuked them [and said, Ye know not of what spirit ye are].
- Webster's Bible (WBS)
- But he turned, and rebuked them, and said, Ye know not what manner of spirit ye are of.
- Young's Literal Translation (YLT)
- and having turned, he rebuked them, and said, 'Ye have not known of what spirit ye are;
Read in context
- 53ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వా రాయనను చేర్చుకొనలేదు.
- 54శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా,
- 55ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
- 56అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
- 57వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
Cross references
- Job 2:10 యోబు 2:10అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Matthew 16:23 మత్తయి 16:23అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.
- Job 26:4 యోబు 26:4నీవు ఎవనియెదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలోనుండి బయలుదేరినది?
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- Jeremiah 17:9 యిర్మీయా 17:9హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
- Job 31:29–31 యోబు 31:29–31నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను
- Matthew 26:51 మత్తయి 26:51ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.
- Job 34:4–9 యోబు 34:4–9న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి. నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు. యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను. నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
- Job 35:2–4 యోబు 35:2–4నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే? ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను.
- Acts 23:3–5 అపొస్తలుల కార్యములు 23:3–5పౌలు అతనిని చూచి సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి. దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి యున్నదనెను.
- 1 Samuel 24:4–7 1 సమూయేలు 24:4–7దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.