Mark · chapter 9 · verse 13
Mark 9:13 in Telugu
ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
Eleeyaa vachchenaniyu atanigoorchi vraayabadina prakaaramu vaaru tamakishtamu vachchinattu ataniyedala chesiraniyu meeto cheppu chunnaanani vaarito anenu.
Mark 9:13 in English
- King James Version (KJV)
- But I say unto you, That Elias is indeed come, and they have done unto him whatsoever they listed, as it is written of him.
- World English Bible (WEB)
- But I tell you that Elijah has come, and they have also done to him whatever they wanted to, even as it is written about him.”
- American Standard Version (ASV)
- But I say unto you, that Elijah is come, and they have also done unto him whatsoever they would, even as it is written of him.
- Bible in Basic English (BBE)
- But I say to you that Elijah has come, and they have done to him whatever they were pleased to do, even as the Writings say about him.
- Darby Translation (DBY)
- but I say unto you that Elias also is come, and they have done to him whatever they would, as it is written of him.
- Webster's Bible (WBS)
- But I say to you, that Elijah is indeed come, and they have done to him whatever they pleased, as it is written concerning him.
- Young's Literal Translation (YLT)
- But I say to you, That also Elijah hath come, and they did to him what they willed, as it hath been written of him.'
Read in context
- 11వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.
- 12అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
- 13ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
- 14వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.
- 15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.
Cross references
- Matthew 14:3–11 మత్తయి 14:3–11ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.
- Matthew 11:14 మత్తయి 11:14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.
- Matthew 17:12–13 మత్తయి 17:12–13అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.
- Luke 1:17 లూకా 1:17మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
- Luke 3:19–20 లూకా 3:19–20అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
- Mark 6:14–28 మార్కు 6:14–28ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి వినిబాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుత ములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరుఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు వినినేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇత డామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విని నప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజునీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను మరియు - నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను గనుక ఆమె వెళ్లి - నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి - బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టియిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.
- Acts 7:52 అపొస్తలుల కార్యములు 7:52మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.