Matthew · chapter 6 · verse 1
Matthew 6:1 in Telugu
మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
Manushyulaku kanabadavalenani vaariyeduta mee neeti kaaryamu cheyakunda jaagrattapadudi; leniyedala paralokamandunna mee tandriyodda meeru phalamu pondaru.
Matthew 6:1 in English
- King James Version (KJV)
- Take heed that ye do not your alms before men, to be seen of them: otherwise ye have no reward of your Father which is in heaven.
- World English Bible (WEB)
- “Be careful that you don’t do your charitable giving before men, to be seen by them, or else you have no reward from your Father who is in heaven.
- American Standard Version (ASV)
- Take heed that ye do not your righteousness before men, to be seen of them: else ye have no reward with your Father who is in heaven.
- Bible in Basic English (BBE)
- Take care not to do your good works before men, to be seen by them; or you will have no reward from your Father in heaven.
- Darby Translation (DBY)
- Take heed not to do your alms before men to be seen of them, otherwise ye have no reward with your Father who is in the heavens.
- Webster's Bible (WBS)
- Take heed that ye do not your alms before men, to be seen by them: otherwise ye have no reward from your Father who is in heaven.
- Young's Literal Translation (YLT)
- 'Take heed your kindness not to do before men, to be seen by them, and if not — reward ye have not from your Father who [is] in the heavens;
Read in context
- 1మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.
- 2కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- 3నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.
Cross references
- Matthew 23:5 మత్తయి 23:5మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
- John 12:43 యోహాను 12:43వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
- Hebrews 6:10 హెబ్రీయులకు 6:10మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.
- Matthew 23:28–30 మత్తయి 23:28–30ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.
- Luke 16:15 లూకా 16:15ఆయన మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.
- Matthew 6:4–6 మత్తయి 6:4–6అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
- Galatians 6:12 గలతీయులకు 6:12శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు
- Ezekiel 33:31 యెహెజ్కేలు 33:31నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది.
- 2 John 1:8 2 యోహాను 1:8అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
- John 5:44 యోహాను 5:44అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;
- Matthew 6:16 మత్తయి 6:16మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
- Matthew 16:6 మత్తయి 16:6అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.