Numbers · chapter 17 · verse 13
Numbers 17:13 in Telugu
యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.
Yehovaa mandiramunaku sameepinchu prativaadunu chachchunu; memu andaramu chaavavalasiyunnadaa? Ani palikiri.
Numbers 17:13 in English
- King James Version (KJV)
- Whosoever cometh any thing near unto the tabernacle of the LORD shall die: shall we be consumed with dying?
- World English Bible (WEB)
- Everyone who keeps approaching the LORD’s tabernacle, dies! Will we all perish?”
- American Standard Version (ASV)
- Every one that cometh near, that cometh near unto the tabernacle of Jehovah, dieth: shall we perish all of us?
- Bible in Basic English (BBE)
- Death will overtake everyone who comes near, who comes near the House of the Lord: are we all to come to destruction?
- Darby Translation (DBY)
- Every one that comes at all near to the tabernacle of Jehovah shall die: shall we then expire altogether?
- Webster's Bible (WBS)
- Whoever approacheth the tabernacle of the LORD shall die: shall we be consumed with dying?
- Young's Literal Translation (YLT)
- any who is at all drawing near unto the tabernacle of Jehovah dieth; have we not been consumed — to expire?'
Read in context
- 11అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.
- 12అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరిఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతివిు మేమందరము నశించిపోతివిు.
- 13యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.
Cross references
- Numbers 18:4–7 సంఖ్యాకాండము 18:4–7వారు నీతో కలిసి ప్రత్య క్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను. అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడ వలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయు లైన మీ సహోద రులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపుసేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.
- Deuteronomy 2:16 ద్వితీయోపదేశకాండము 2:16సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను.
- Isaiah 28:22 యెషయా 28:22మీ బంధకములు మరి బిగింపబడకుండునట్లు పరిహాసకులై యుండకుడి భూమియందంతట నాశనము ఖండితముగా నియమింప బడెను ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను దాని సమాచారము వింటిని
- 2 Samuel 6:6–12 2 సమూయేలు 6:6–12వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదేపేరు. ఆ దినమునయెహోవా మందసము నాయొద్ద ఏలాగుండుననుకొని, దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తనయొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయు డగు ఓబేదెదోము ఇంటివరకు తీసికొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.
- Ephesians 2:13 ఎఫెసీయులకు 2:13అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.
- 1 Samuel 6:19–21 1 సమూయేలు 6:19–21బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబది వేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపిఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.
- Numbers 1:51–53 సంఖ్యాకాండము 1:51–53మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
- Acts 5:11–14 అపొస్తలుల కార్యములు 5:11–14సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
- 1 Chronicles 13:11–13 1 దినవృత్తాంతములు 13:11–13యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొందిదేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయు డైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.
- Psalm 90:7 కీర్తనలు 90:7నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
- Numbers 16:26 సంఖ్యాకాండము 16:26అతడుఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.
- Numbers 32:13 సంఖ్యాకాండము 32:13అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.