Proverbs · chapter 11 · verse 1
Proverbs 11:1 in Telugu
దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
Dongatraasu yehovaaku heyamu sariyaina gundu aayanakishtamu.
Proverbs 11:1 in English
- King James Version (KJV)
- A false balance [is] abomination to the LORD: but a just weight [is] his delight.
- World English Bible (WEB)
- A false balance is an abomination to the LORD, but accurate weights are his delight.
- American Standard Version (ASV)
- A false balance is an abomination to Jehovah; But a just weight is his delight.
- Bible in Basic English (BBE)
- Scales of deceit are hated by the Lord, but a true weight is his delight.
- Darby Translation (DBY)
- A false balance is an abomination to Jehovah; but a just weight is his delight.
- Webster's Bible (WBS)
- A false balance [is] abomination to the LORD: but a just weight [is] his delight.
- Young's Literal Translation (YLT)
- Balances of deceit [are] an abomination to Jehovah, And a perfect weight [is] His delight.
Read in context
- 1దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
- 2అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.
- 3యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును ద్రోహుల మూర్ఖస్వభావము వారిని పాడుచేయును.
Cross references
- Deuteronomy 25:13–16 ద్వితీయోపదేశకాండము 25:13–16హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు. హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు. నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
- Proverbs 20:23 సామెతలు 20:23వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు.
- Proverbs 16:11 సామెతలు 16:11న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
- Leviticus 19:35–36 లేవీయకాండము 19:35–36తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.
- Proverbs 20:10 సామెతలు 20:10వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
- Amos 8:5–6 ఆమోసు 8:5–6తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా, దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
- Hosea 12:7 హోషేయ 12:7ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
- Ezekiel 45:10–12 యెహెజ్కేలు 45:10–12ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను. తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
- Micah 6:10–11 మీకా 6:10–11అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా. తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?