Proverbs · chapter 12 · verse 20
Proverbs 12:20 in Telugu
కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
Keedu kalpinchuvaari hrudayamulo mosamukaladu samaadhaanaparachutakai aalochana cheppuvaaru santosha bharitulaguduru.
Proverbs 12:20 in English
- King James Version (KJV)
- Deceit [is] in the heart of them that imagine evil: but to the counsellors of peace [is] joy.
- World English Bible (WEB)
- Deceit is in the heart of those who plot evil, but joy comes to the promoters of peace.
- American Standard Version (ASV)
- Deceit is in the heart of them that devise evil; But to the counsellors of peace is joy.
- Bible in Basic English (BBE)
- Deceit is in the heart of those whose designs are evil, but for those purposing peace there is joy.
- Darby Translation (DBY)
- Deceit is in the heart of them that devise evil; but to the counsellors of peace is joy.
- Webster's Bible (WBS)
- Deceit [is] in the heart of them that imagine evil: but to the counselors of peace [is] joy.
- Young's Literal Translation (YLT)
- Deceit [is] in the heart of those devising evil, And to those counselling peace [is] joy.
Read in context
- 18కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
- 19నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
- 20కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
- 21నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
- 22అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
Cross references
- Matthew 5:9 మత్తయి 5:9సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
- 1 Peter 3:8–13 1 పేతురు 3:8–13తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?
- Mark 7:21–22 మార్కు 7:21–22లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభి చారములును లోభములును చెడుతనములును కృత్రిమ మును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.
- Proverbs 26:24–26 సామెతలు 26:24–26పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
- Jeremiah 17:16 యిర్మీయా 17:16నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటనుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.
- Zechariah 6:13 జెకర్యా 6:13అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.
- Proverbs 12:12 సామెతలు 12:12భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును.
- Hebrews 12:14 హెబ్రీయులకు 12:14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- Romans 1:29 రోమీయులకు 1:29అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై
- Mark 12:14–17 మార్కు 12:14–17వారు వచ్చిబోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మే మెరుగుదుము; నీవు మోమోటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగిమీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి, ఆయనఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారి నడుగగా వారుకైసరువి అనిరి. అందుకు యేసుకైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.
- Isaiah 9:6–7 యెషయా 9:6–7ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.