Proverbs · chapter 13 · verse 22
Proverbs 13:22 in Telugu
మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
Manchivaadu tana pillala pillalanu aastikartalanugaa cheyunu paapaatmula aasti neetimantulaku unchabadunu.
Proverbs 13:22 in English
- King James Version (KJV)
- A good [man] leaveth an inheritance to his children’s children: and the wealth of the sinner [is] laid up for the just.
- World English Bible (WEB)
- A good man leaves an inheritance to his children’s children, but the wealth of the sinner is stored for the righteous.
- American Standard Version (ASV)
- A good man leaveth an inheritance to his children’s children; And the wealth of the sinner is laid up for the righteous.
- Bible in Basic English (BBE)
- The heritage of the good man is handed down to his children's children; and the wealth of the sinner is stored up for the upright man.
- Darby Translation (DBY)
- A good man leaveth an inheritance to his children's children; but the wealth of the sinner is laid up for the righteous [man].
- Webster's Bible (WBS)
- A good [man] leaveth an inheritance to his children's children: and the wealth of the sinner [is] laid up for the just.
- Young's Literal Translation (YLT)
- A good man causeth sons' sons to inherit, And laid up for the righteous [is] the sinner's wealth.
Read in context
- 20జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
- 21కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును.
- 22మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
- 23బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయమువలన నశించువారు కలరు.
- 24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
Cross references
- Ecclesiastes 2:26 ప్రసంగి 2:26ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.
- Job 27:16–17 యోబు 27:16–17ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధ పరచుకొనినను వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
- Proverbs 28:8 సామెతలు 28:8వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
- Psalm 37:25 కీర్తనలు 37:25నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
- Psalm 112:2 కీర్తనలు 112:2వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
- Genesis 17:7–8 ఆదికాండము 17:7–8నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీతరువాత నీ సంతతికిని నీవు పరదేశివై యున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
- Psalm 25:12–13 కీర్తనలు 25:12–13యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
- Ezra 9:12 ఎజ్రా 9:12కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.
- Psalm 128:6 కీర్తనలు 128:6నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.
- Psalm 102:28 కీర్తనలు 102:28నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.