Proverbs · chapter 16 · verse 3
Proverbs 16:3 in Telugu
నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
Nee panula bhaaramu yehovaameeda nunchumu appudu nee uddeshamulu saphalamagunu.
Proverbs 16:3 in English
- King James Version (KJV)
- Commit thy works unto the LORD, and thy thoughts shall be established.
- World English Bible (WEB)
- Commit your deeds to the LORD, and your plans shall succeed.
- American Standard Version (ASV)
- Commit thy works unto Jehovah, And thy purposes shall be established.
- Bible in Basic English (BBE)
- Put your works into the hands of the Lord, and your purposes will be made certain.
- Darby Translation (DBY)
- Commit thy works unto Jehovah, and thy thoughts shall be established.
- Webster's Bible (WBS)
- Commit thy works to the LORD, and thy thoughts shall be established.
- Young's Literal Translation (YLT)
- Roll unto Jehovah thy works, And established are thy purposes,
Read in context
- 1హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
- 2ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
- 3నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
- 4యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
- 5గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
Cross references
- Psalm 37:4–5 కీర్తనలు 37:4–5యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.
- Proverbs 3:6 సామెతలు 3:6నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
- Psalm 55:22 కీర్తనలు 55:22నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- 1 Peter 5:7 1 పేతురు 5:7ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
- Job 22:28 యోబు 22:28మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
- Job 5:8 యోబు 5:8అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
- Luke 12:22 లూకా 12:22అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను–ఈ హేతువుచేత మీరు – ఏమి తిందుమో, అని మీ ప్రాణమునుగూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమునుగూర్చియైనను చింతింపకుడి.
- Matthew 6:25–34 మత్తయి 6:25–34అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
- Isaiah 7:5–7 యెషయా 7:5–7సిరియాయు, ఎఫ్రాయి మును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశముమీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఆ మాట నిలువదు, జరు గదు.