Proverbs · chapter 19 · verse 10
Proverbs 19:10 in Telugu
భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
Bhogamula nanubhavinchuta buddhiheenuniki tagadu raajulaneluta daasuniki bottigaa tagadu.
Proverbs 19:10 in English
- King James Version (KJV)
- Delight is not seemly for a fool; much less for a servant to have rule over princes.
- World English Bible (WEB)
- Delicate living is not appropriate for a fool, much less for a servant to have rule over princes.
- American Standard Version (ASV)
- Delicate living is not seemly for a fool; Much less for a servant to have rule over princes.
- Bible in Basic English (BBE)
- Material comfort is not good for the foolish; much less for a servant to be put over rulers.
- Darby Translation (DBY)
- Good living beseemeth not a fool; how much less for a servant to have rule over princes.
- Webster's Bible (WBS)
- Delight is not seemly for a fool; much less for a servant to have rule over princes.
- Young's Literal Translation (YLT)
- Luxury is not comely for a fool, Much less for a servant to rule among princes.
Read in context
- 8బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
- 9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.
- 10భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
- 11ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
- 12రాజు కోపము సింహగర్జనవంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.
Cross references
- Proverbs 30:21–22 సామెతలు 30:21–22భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,
- Proverbs 26:1 సామెతలు 26:1ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
- Luke 16:19 లూకా 16:19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
- Luke 16:23 లూకా 16:23అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
- Esther 3:15 ఎస్తేరు 3:15అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
- Amos 6:3–6 ఆమోసు 6:3–6ఉపద్రవ దినము బహుదూరముననున్న దనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయు దురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
- Hosea 7:3–5 హోషేయ 7:3–5వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారందరు మానని కామాతురతగలవారై యున్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను.
- 1 Samuel 25:36 1 సమూయేలు 25:36అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.
- 2 Samuel 3:24–25 2 సమూయేలు 3:24–25యోవాబు రాజునొద్దకు వచ్చిచిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవు చేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి
- Isaiah 3:5 యెషయా 3:5ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.
- James 4:9 యాకోబు 4:9వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
- 2 Samuel 3:39 2 సమూయేలు 3:39పట్టాభిషేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడు చేయునుగాక.