Psalms · chapter 103 · verse 7
Psalm 103:7 in Telugu
ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను
Aayana mosheku tana maargamulanu teliyajesenu ishraayelu vanshasthulaku tana kriyalanu kanuparachenu
Psalm 103:7 in English
- King James Version (KJV)
- He made known his ways unto Moses, his acts unto the children of Israel.
- World English Bible (WEB)
- He made known his ways to Moses, his deeds to the children of Israel.
- American Standard Version (ASV)
- He made known his ways unto Moses, His doings unto the children of Israel.
- Bible in Basic English (BBE)
- He gave knowledge of his way to Moses, and made his acts clear to the children of Israel.
- Darby Translation (DBY)
- He made known his ways unto Moses, his acts unto the children of Israel.
- Webster's Bible (WBS)
- He made known his ways to Moses, his acts to the children of Israel.
- Young's Literal Translation (YLT)
- He maketh known His ways to Moses, To the sons of Israel His acts.
Read in context
- 5పక్షిరాజు ¸యౌవనమువలె నీ ¸యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
- 6యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును
- 7ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను
- 8యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.
- 9ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు.
Cross references
- Exodus 33:13 నిర్గమకాండము 33:13కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును; చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
- Psalm 147:19 కీర్తనలు 147:19ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
- Psalm 78:11 కీర్తనలు 78:11ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
- Nehemiah 9:14 నెహెమ్యా 9:14వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.
- Psalm 77:20 కీర్తనలు 77:20మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
- Deuteronomy 34:10 ద్వితీయోపదేశకాండము 34:10ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని
- Psalm 99:7 కీర్తనలు 99:7మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
- John 5:45–47 యోహాను 5:45–47మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.
- Exodus 19:8 నిర్గమకాండము 19:8అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
- Exodus 24:2–4 నిర్గమకాండము 24:2–4మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి
- Exodus 20:21 నిర్గమకాండము 20:21ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
- Acts 7:35–60 అపొస్తలుల కార్యములు 7:35–60అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే. సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా? మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను. అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనిన వారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను. అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను. వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.