Psalms · chapter 119 · verse 154
Psalm 119:154 in Telugu
నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
Naa pakshamuna vyaajyemaadi nannu vimochimpumu neevichchina maatachoppuna nannu bradikimpumu.
Psalm 119:154 in English
- King James Version (KJV)
- Plead my cause, and deliver me: quicken me according to thy word.
- World English Bible (WEB)
- Plead my cause, and redeem me! Revive me according to your promise.
- American Standard Version (ASV)
- Plead thou my cause, and redeem me: Quicken me according to thy word.
- Bible in Basic English (BBE)
- Undertake my cause, and come to my help, give me life, as you have said.
- Darby Translation (DBY)
- Plead my cause, and redeem me: quicken me according to thy *word.
- Webster's Bible (WBS)
- Plead my cause, and deliver me: revive me according to thy word.
- Young's Literal Translation (YLT)
- Plead my plea, and redeem me, According to Thy saying quicken me.
Read in context
- 152నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
- 153(రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- 154నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- 155భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.
- 156యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
Cross references
- Psalm 35:1 కీర్తనలు 35:1యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యెమాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
- Micah 7:9 మీకా 7:9నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను.
- Jeremiah 50:34 యిర్మీయా 50:34వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యెమును కడ ముట్టించును.
- 1 Samuel 24:15 1 సమూయేలు 24:15యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- Psalm 119:40 కీర్తనలు 119:40నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- Jeremiah 11:20 యిర్మీయా 11:20నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
- Psalm 119:25 కీర్తనలు 119:25(దాలెత్) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
- Proverbs 22:23 సామెతలు 22:23యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచు కొనును.
- 1 John 2:1 1 యోహాను 2:1నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.
- Jeremiah 51:36 యిర్మీయా 51:36యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము, నీ వ్యాజ్యెమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగతీర్చుకొందును దాని సముద్రమును నేనెండకట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును.
- Psalm 43:1 కీర్తనలు 43:1దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
- Job 5:8 యోబు 5:8అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.