Psalms · chapter 124 · verse 7
Psalm 124:7 in Telugu
పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
Pakshi tappinchukoninatlu mana praanamu vetakaandra urinundi tappinchukoni yunnadi uri tempabadenu manamu tappinchukoni yunnaamu.
Psalm 124:7 in English
- King James Version (KJV)
- Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we are escaped.
- World English Bible (WEB)
- Our soul has escaped like a bird out of the fowler’s snare. The snare is broken, and we have escaped.
- American Standard Version (ASV)
- Our soul is escaped as a bird out of the snare of the fowlers: The snare is broken, and we are escaped.
- Bible in Basic English (BBE)
- Our soul has gone free like a bird out of the net of those who would take her: the net is broken, and we are free.
- Darby Translation (DBY)
- Our soul is escaped as a bird out of the snare of the fowlers: the snare is broken, and we have escaped.
- Webster's Bible (WBS)
- Our soul hath escaped as a bird out of the snare of the fowlers: the snare [is] broken, and we have escaped.
- Young's Literal Translation (YLT)
- Our soul as a bird hath escaped from a snare of fowlers, The snare was broken, and we have escaped.
Read in context
- 5ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.
- 6వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
- 7పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
- 8భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.
Cross references
- Psalm 91:3 కీర్తనలు 91:3వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
- Proverbs 6:5 సామెతలు 6:5వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
- 2 Timothy 2:26 2 తిమోతికి 2:26ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
- Psalm 25:15 కీర్తనలు 25:15నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
- 1 Samuel 25:29 1 సమూయేలు 25:29నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
- 1 Samuel 23:26–27 1 సమూయేలు 23:26–27అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టు కొనుచుండిరి. ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా
- 2 Samuel 17:21–22 2 సమూయేలు 17:21–22వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలోనుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతనిమీద చేసిన ఆలోచన తెలియజేసినీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.
- Jeremiah 18:22 యిర్మీయా 18:22నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.
- 1 Samuel 24:14–15 1 సమూయేలు 24:14–15ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- 2 Samuel 17:2 2 సమూయేలు 17:2నేను అతనిమీద పడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను;
- Jeremiah 5:26 యిర్మీయా 5:26నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.