Psalms · chapter 150 · verse 5
Psalm 150:5 in Telugu
మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
Mrogu taalamulato aayananu stutinchudi. Gambheeradhvanigala taalamulato aayananu stutinchudi.
Psalm 150:5 in English
- King James Version (KJV)
- Praise him upon the loud cymbals: praise him upon the high sounding cymbals.
- World English Bible (WEB)
- Praise him with loud cymbals! Praise him with resounding cymbals!
- American Standard Version (ASV)
- Praise him with loud cymbals: Praise him with high sounding cymbals.
- Bible in Basic English (BBE)
- Give him praise with the loud brass: give him praise with the high-sounding brass.
- Darby Translation (DBY)
- Praise him with loud cymbals; praise him with high sounding cymbals.
- Webster's Bible (WBS)
- Praise him upon the loud cymbals: praise him upon the high sounding cymbals.
- Young's Literal Translation (YLT)
- Praise Him with cymbals of sounding, Praise Him with cymbals of shouting.
Read in context
- 3బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
- 4తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
- 5మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
- 6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
Cross references
- 1 Chronicles 15:16 1 దినవృత్తాంతములు 15:16అంతట దావీదుమీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.
- 1 Chronicles 25:1 1 దినవృత్తాంతములు 25:1మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
- 1 Chronicles 15:19 1 దినవృత్తాంతములు 15:19పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.
- 1 Chronicles 15:28 1 దినవృత్తాంతములు 15:28ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.
- 1 Chronicles 25:6 1 దినవృత్తాంతములు 25:6వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
- 2 Samuel 6:5 2 సమూయేలు 6:5దావీదును ఇశ్రాయేలీయులందరును సరళవృక్షపు కఱ్ఱతో చేయబడిన నానావిధములైన సితారాలను స్వర మండలములను తంబురలను మృదంగములను పెద్ద తాళము లను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి.
- 1 Chronicles 16:5 1 దినవృత్తాంతములు 16:5వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
- 1 Chronicles 13:8 1 దినవృత్తాంతములు 13:8దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.