Psalms · chapter 18 · verse 30
Psalm 18:30 in Telugu
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.
Devudu yathaarthavantudu yehovaa vaakku nirmalamutana sharanujochchu vaarikandariki aayana kedemu.
Psalm 18:30 in English
- King James Version (KJV)
- [As for] God, his way [is] perfect: the word of the LORD is tried: he [is] a buckler to all those that trust in him.
- World English Bible (WEB)
- As for God, his way is perfect. The LORD’s word is tried. He is a shield to all those who take refuge in him.
- American Standard Version (ASV)
- As for God, his way is perfect: The word of Jehovah is tried; He is a shield unto all them that take refuge in him.
- Bible in Basic English (BBE)
- As for God, his way is completely good; the word of the Lord is tested; he is a breastplate for all those who put their faith in him.
- Darby Translation (DBY)
- As for God, his way is perfect; the word of Jehovah is tried: he is a shield to all that trust in him.
- Webster's Bible (WBS)
- [As for] God, his way [is] perfect: the word of the LORD is tried: he [is] a buckler to all those that trust in him.
- Young's Literal Translation (YLT)
- God! perfect [is] His way, The saying of Jehovah is tried, A shield [is] He to all those trusting in Him.
Read in context
- 28నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
- 29నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
- 30దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలముతన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.
- 31యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
- 32నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
Cross references
- Deuteronomy 32:4 ద్వితీయోపదేశకాండము 32:4ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
- Proverbs 30:5 సామెతలు 30:5దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
- 2 Samuel 22:31 2 సమూయేలు 22:31దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
- Psalm 84:11–12 కీర్తనలు 84:11–12దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై యున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు. సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు.
- Psalm 12:6 కీర్తనలు 12:6యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు.
- Revelation 15:3 ప్రకటన 15:3వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Psalm 19:7–10 కీర్తనలు 19:7–10యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
- Psalm 119:140 కీర్తనలు 119:140నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది.
- Psalm 18:2 కీర్తనలు 18:2యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము.
- Psalm 25:10 కీర్తనలు 25:10ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయములో యెహోవా త్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
- Daniel 4:37 దానియేలు 4:37ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను.
- Romans 12:2 రోమీయులకు 12:2మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.