Psalms · chapter 32 · verse 4
Psalm 32:4 in Telugu
దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. )
Divaaraatrulu nee cheyyi naameeda baruvugaa nundenu naa saaramu vesavikaalamuna endinattaayenu. (selaa. )
Psalm 32:4 in English
- King James Version (KJV)
- For day and night thy hand was heavy upon me: my moisture is turned into the drought of summer. Selah.
- World English Bible (WEB)
- For day and night your hand was heavy on me. My strength was sapped in the heat of summer. Selah.
- American Standard Version (ASV)
- For day and night thy hand was heavy upon me: My moisture was changed [as] with the drought of summer. [Selah
- Bible in Basic English (BBE)
- For the weight of your hand was on me day and night; my body became dry like the earth in summer. (Selah.)
- Darby Translation (DBY)
- For day and night thy hand was heavy upon me; my moisture was turned into the drought of summer. Selah.
- Webster's Bible (WBS)
- For day and night thy hand was heavy upon me: my moisture is turned into the drouth of summer. Selah.
- Young's Literal Translation (YLT)
- When by day and by night Thy hand is heavy upon me, My moisture hath been changed Into the droughts of summer. Selah.
Read in context
- 2యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.
- 3నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.
- 4దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను. (సెలా. )
- 5నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. )
- 6కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థనచేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
Cross references
- 1 Samuel 5:11 1 సమూయేలు 5:11కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించిఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జను లను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించు డనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టి యుండెను.
- Psalm 38:2–8 కీర్తనలు 38:2–8నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది. నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు. నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి. నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
- Job 33:7 యోబు 33:7నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
- Psalm 39:10–11 కీర్తనలు 39:10–11నీవు పంపిన తెగులు నా మీదనుండి తొలగింపుము. నీ చేతి దెబ్బవలన నేను క్షీణించుచున్నాను. దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా. )
- Psalm 22:15 కీర్తనలు 22:15నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నదినీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
- Psalm 102:3–4 కీర్తనలు 102:3–4పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
- Psalm 90:6–7 కీర్తనలు 90:6–7ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
- Job 30:30 యోబు 30:30నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను.
- 1 Samuel 5:6–7 1 సమూయేలు 5:6–7యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్డోదువారు సంభవించిన దాని చూచిఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవత యగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని
- 1 Samuel 6:9 1 సమూయేలు 6:9అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.
- Lamentations 5:10 విలాపవాక్యములు 5:10మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
- Job 16:21 యోబు 16:21నర పుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరి నేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.