Psalms · chapter 7 · verse 4
Psalm 7:4 in Telugu
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
Naacheta paapamu jariginayedala naato samaadhaanamugaa nundinavaaniki nenu keeduchesinayedala
Psalm 7:4 in English
- King James Version (KJV)
- If I have rewarded evil unto him that was at peace with me; (yea, I have delivered him that without cause is mine enemy:)
- World English Bible (WEB)
- if I have rewarded evil to him who was at peace with me (yes, I have plundered him who without cause was my adversary),
- American Standard Version (ASV)
- If I have rewarded evil unto him that was at peace with me (Yea, I have delivered him that without cause was mine adversary);
- Bible in Basic English (BBE)
- If I have given back evil to him who did evil to me, or have taken anything from him who was against me without cause;
- Darby Translation (DBY)
- If I have rewarded evil to him that was at peace with me; (indeed I have freed him that without cause oppressed me;)
- Webster's Bible (WBS)
- If I have rewarded evil to him that was at peace with me; (yes, I have delivered him that without cause is my enemy:)
- Young's Literal Translation (YLT)
- If I have done my well-wisher evil, And draw mine adversary without cause,
Read in context
- 2వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ నన్ను తప్పించుము.
- 3యెహోవా నా దేవా, నేను ఈ కార్యముచేసినయెడల
- 4నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
- 5శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్మునా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్మునా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని నేను సంరక్షించితిని గదా(సెలా. )
- 6యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్మునా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్మునన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించియున్నావు గదా.
Cross references
- 1 Samuel 24:17–19 1 సమూయేలు 24:17–19దావీదుతో ఇట్లనెను - యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
- Psalm 55:20 కీర్తనలు 55:20తమతో సమాధానముగా నున్నవారికి వారు బలా త్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.
- Psalm 109:5 కీర్తనలు 109:5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.
- Jeremiah 18:20–21 యిర్మీయా 18:20–21వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము. వారి కుమారులను క్షామమునకు అప్ప గింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవ రాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి ¸యవ నులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
- 1 Samuel 24:7 1 సమూయేలు 24:7ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
- Proverbs 17:3 సామెతలు 17:3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.
- 1 Samuel 25:28–29 1 సమూయేలు 25:28–29నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడ వగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగ కుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్ద నున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.
- 1 Samuel 24:10–15 1 సమూయేలు 24:10–15ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని. నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను. పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
- 1 Samuel 19:4–5 1 సమూయేలు 19:4–5యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదును గూర్చి దయగా మాటలాడినీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా
- Genesis 44:4 ఆదికాండము 44:4వారు ఆ పట్టణమునుండి బయలు దేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని మీరు మేలుకు కీడు చేయనేల?
- 1 Samuel 22:14 1 సమూయేలు 22:14అహీమెలెకురాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?
- 1 Samuel 20:1 1 సమూయేలు 20:1పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారి పోయి యోనాతాను నొద్దకు వచ్చినేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని యడుగగా