Deuteronomy · chapter 8 · verse 5
Deuteronomy 8:5 in Telugu
ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని
Okadu tana kumaaruni etlu shikshincheno atle nee devudaina yehovaa ninnu shikshinchuvaadani neevu telisikoni
Deuteronomy 8:5 in English
- King James Version (KJV)
- Thou shalt also consider in thine heart, that, as a man chasteneth his son, [so] the LORD thy God chasteneth thee.
- World English Bible (WEB)
- You shall consider in your heart that as a man disciplines his son, so the LORD your God disciplines you.
- American Standard Version (ASV)
- And thou shalt consider in thy heart, that, as a man chasteneth his son, so Jehovah thy God chasteneth thee.
- Bible in Basic English (BBE)
- Keep in mind this thought, that as a son is trained by his father, so you have been trained by the Lord your God.
- Darby Translation (DBY)
- And know in thy heart that, as a man chasteneth his son, so Jehovah thy God chasteneth thee;
- Webster's Bible (WBS)
- Thou shalt also consider in thy heart, that as a man chasteneth his son, [so] the LORD thy God chasteneth thee.
- Young's Literal Translation (YLT)
- and thou hast known, with thy heart, that as a man chastiseth his son Jehovah thy God is chastising thee,
Read in context
- 3ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
- 4ఈ నలువది సంవత్సరములు నీవు వేసికొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు.
- 5ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని
- 6ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయ పడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొన వలెను.
- 7నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.
Cross references
- Revelation 3:19 ప్రకటన 3:19నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
- 2 Samuel 7:14 2 సమూయేలు 7:14నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని
- Proverbs 3:12 సామెతలు 3:12తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
- Job 5:17–18 యోబు 5:17–18దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.
- Hebrews 12:5–11 హెబ్రీయులకు 12:5–11మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
- 1 Corinthians 11:32 1 కొరింథీయులకు 11:32మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.
- Psalm 94:12 కీర్తనలు 94:12యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
- Psalm 89:32 కీర్తనలు 89:32నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.
- Ezekiel 18:28 యెహెజ్కేలు 18:28అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.
- Deuteronomy 4:9 ద్వితీయోపదేశకాండము 4:9అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండు నట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
- Deuteronomy 4:23 ద్వితీయోపదేశకాండము 4:23మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి, నీ దేవు డైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను.
- Isaiah 1:3 యెషయా 1:3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు