Ezekiel · chapter 23 · verse 7
Ezekiel 23:7 in Telugu
అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.
Adi kaamukuraalireetigaa ashshooruvaarilo mukhyulagu vaarandariyeduta tiruguchu, vaarandarito vyabhicharinchuchu, vaaru pettukonina vigrahamulannitini poojinchuchu, apavitruraalaayenu.
Ezekiel 23:7 in English
- King James Version (KJV)
- Thus she committed her whoredoms with them, with all them [that were] the chosen men of Assyria, and with all on whom she doted: with all their idols she defiled herself.
- World English Bible (WEB)
- She gave herself as a prostitute to them, all of them the choicest men of Assyria. She defiled herself with the idols of whomever she lusted after.
- American Standard Version (ASV)
- And she bestowed her whoredoms upon them, the choicest men of Assyria all of them; and on whomsoever she doted, with all their idols she defiled herself.
- Bible in Basic English (BBE)
- And she gave her unclean love to them, all of them the noblest men of Assyria: and she made herself unclean with the images of all who were desired by her.
- Darby Translation (DBY)
- And she bestowed her whoredoms upon them, all of them the choice of the children of Asshur; and with all after whom she lusted, with all their idols she defiled herself.
- Webster's Bible (WBS)
- Thus she committed her lewd deeds with them, with all them [that were] the chosen men of Assyria, and with all on whom she doted: with all their idols she defiled herself.
- Young's Literal Translation (YLT)
- And she giveth her whoredoms on them, The choice of the sons of Asshur, All of them — even all on whom she doted, By all their idols she hath been defiled.
Read in context
- 5ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి
- 6తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.
- 7అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.
- 8మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
- 9కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను.
Cross references
- Hosea 5:3 హోషేయ 5:3ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.
- Hosea 6:10 హోషేయ 6:10ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు.
- Ezekiel 20:7 యెహెజ్కేలు 20:7అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.
- Ezekiel 22:3–4 యెహెజ్కేలు 22:3–4ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసి కొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి, నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియ మించుచున్నాను.
- Psalm 106:39 కీర్తనలు 106:39తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
- Genesis 10:22 ఆదికాండము 10:22షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- Ezekiel 16:15 యెహెజ్కేలు 16:15అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసికొని, నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారినిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్ల పోతివి.
- Ezekiel 23:30 యెహెజ్కేలు 23:30నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.