Genesis · chapter 15 · verse 8
Genesis 15:8 in Telugu
అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
Atadu prabhuvaina yehovaa, nenu deeni svatantrinchu konedanani naaketlu teliyunanagaa
Genesis 15:8 in English
- King James Version (KJV)
- And he said, Lord GOD, whereby shall I know that I shall inherit it?
- World English Bible (WEB)
- He said, “Lord GOD, how will I know that I will inherit it?”
- American Standard Version (ASV)
- And he said, O Lord Jehovah, whereby shall I know that I shall inherit it?
- Bible in Basic English (BBE)
- And he said, O Lord God, how may I be certain that it will be mine?
- Darby Translation (DBY)
- And he said, Lord Jehovah, how shall I know that I shall possess it?
- Webster's Bible (WBS)
- And he said, Lord God, by what shall I know that I shall inherit it?
- Young's Literal Translation (YLT)
- and he saith, 'Lord Jehovah, whereby do I know that I possess it?'
Read in context
- 6అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
- 7మరియు ఆయననీవు ఈ దేశమును స్వతంత్రించు కొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు
- 8అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా
- 9ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.
- 10అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు
Cross references
- Luke 1:18 లూకా 1:18జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా
- Luke 1:34 లూకా 1:34అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా
- Isaiah 7:11 యెషయా 7:11నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.
- 2 Kings 20:8 2 రాజులు 20:8యెహోవా నన్ను స్వస్థపరచు ననుటకును, నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కి పోవుదు ననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను
- Judges 6:17–24 న్యాయాధిపతులు 6:17–24అందుకతడునాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయననీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను. అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
- Judges 6:36–40 న్యాయాధిపతులు 6:36–40అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱె బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.
- Psalm 86:17 కీర్తనలు 86:17యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్నాదరించు చున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము.
- Genesis 24:13–14 ఆదికాండము 24:13–14చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
- Genesis 24:2–4 ఆదికాండము 24:2–4అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము; నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను.
- 1 Samuel 14:9–10 1 సమూయేలు 14:9–10వారు మనలను చూచిమేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన యెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము. మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్ప గించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా