Genesis · chapter 31 · verse 27
Genesis 31:27 in Telugu
నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
Neevu naaku cheppaka rahasyamugaa paaripoyi nannu mosapuchchitivela? Sambhramamutonu paatalatonu maddelatonu sitaaraalatonu ninnu saaganampudune.
Genesis 31:27 in English
- King James Version (KJV)
- Wherefore didst thou flee away secretly, and steal away from me; and didst not tell me, that I might have sent thee away with mirth, and with songs, with tabret, and with harp?
- World English Bible (WEB)
- Why did you flee secretly, and deceive me, and didn’t tell me, that I might have sent you away with mirth and with songs, with tambourine and with harp;
- American Standard Version (ASV)
- Wherefore didst thou flee secretly, and steal away from me, and didst not tell me, that I might have sent thee away with mirth and with songs, with tabret and with harp;
- Bible in Basic English (BBE)
- Why did you make a secret of your flight, not giving me word of it, so that I might have sent you away with joy and songs, with melody and music?
- Darby Translation (DBY)
- Why didst thou flee away covertly, and steal away from me, and didst not tell me, that I might have conducted thee with mirth and with songs, with tambour and with harp;
- Webster's Bible (WBS)
- Why didst thou flee away secretly, and steal away from me, and didst not tell me, that I might have sent thee away with mirth, and with songs, with tabret, and with harp?
- Young's Literal Translation (YLT)
- Why hast thou hidden thyself to flee, and deceivest me, and hast not declared to me, and I send thee away with joy and with songs, with tabret and with harp,
Read in context
- 25లాబాను యాకోబును కలిసికొనెను. యాకోబు తన గుడారము ఆ కొండమీద వేసికొనియుండెను; లాబానును తన బంధువులతో గిలాదు కొండమీద గుడారము వేసి కొనెను.
- 26అప్పుడు లాబాను యాకోబుతో నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి, కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేల?
- 27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.
- 28అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టు కొననియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
- 29మీకు హాని చేయుటకు నా చేతనవును; అయితే పోయిన రాత్రి మీ తండ్రియొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమీ అని నాతో చెప్పెను.
Cross references
- Exodus 15:20 నిర్గమకాండము 15:20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- Proverbs 26:23–26 సామెతలు 26:23–26చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు. వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
- Genesis 4:21 ఆదికాండము 4:21అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు.
- Genesis 31:20–21 ఆదికాండము 31:20–21యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుట వలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగిన దంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
- Job 21:11–14 యోబు 21:11–14వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురు ఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
- Genesis 31:3–5 ఆదికాండము 31:3–5అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడైయున్నాడు;
- Genesis 24:59–60 ఆదికాండము 24:59–60కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
- Genesis 31:31 ఆదికాండము 31:31యాకోబు నీవు బలవంతముగా నా యొద్దనుండి నీ కుమార్తెలను తీసికొందువేమో అనుకొని భయపడితిని
- Judges 6:27 న్యాయాధిపతులు 6:27కాబట్టి గిద్యోను తన పని వారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.