Genesis · chapter 49 · verse 19
Genesis 49:19 in Telugu
బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
Bantula gumpu gaadunu kottunu atadu madimenu kottunu.
Genesis 49:19 in English
- King James Version (KJV)
- Gad, a troop shall overcome him: but he shall overcome at the last.
- World English Bible (WEB)
- “A troop will press on Gad, but he will press on their heel.
- American Standard Version (ASV)
- Gad, a troop shall press upon him; But he shall press upon their heel.
- Bible in Basic English (BBE)
- Gad, an army will come against him, but he will come down on them in their flight.
- Darby Translation (DBY)
- Gad — troops will rush upon him; But he will rush upon the heel.
- Webster's Bible (WBS)
- Gad, a troop shall overcome him: but he shall overcome at the last.
- Young's Literal Translation (YLT)
- Gad! a troop assaulteth him, But he assaulteth last.
Read in context
- 17దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.
- 18యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.
- 19బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును.
- 20ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.
- 21నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును.
Cross references
- 1 Chronicles 5:11–22 1 దినవృత్తాంతములు 5:11–22గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి. వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి. వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి. వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱెలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
- Deuteronomy 33:20–21 ద్వితీయోపదేశకాండము 33:20–21గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును. అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడ వచ్చెను యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచరించెను.
- Genesis 30:11 ఆదికాండము 30:11లేయా - ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను.
- 1 Chronicles 5:26 1 దినవృత్తాంతములు 5:26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
- 1 Chronicles 3:18–22 1 దినవృత్తాంతములు 3:18–22మల్కీ రాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి. హషుబా ఓహెలు బెరెక్యాహసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి. హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును. షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.
- Judges 10:1–11 న్యాయాధిపతులు 10:1–11అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను. అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవత లను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశ ములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీ యుల వశములోనుండియు మాత్రము గాక
- Joshua 13:8 యెహోషువ 13:8రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.
- Numbers 32:1–42 సంఖ్యాకాండము 32:1–42రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతొ అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోను రూబే నీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవు చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నే యలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లక పోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్ఠికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను. ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతాన మైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువ చేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింప చేసెదరనెను. అందుకు వారు అతనియొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీయులను వారివారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగి రాము. తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితోమీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్ల గొట్టువరకు యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై యుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసి కొనుడి. మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులును రూబే నీయులును మోషేతో మా యేలినవాడు ఆజ్ఞాపించి నట్లు నీ దాసులమైన మేము చేసెదము. మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికివచ్చెదమనిరి. కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరు కును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీ యుల గోత్రములలో పితరుల కుటుంబ ముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీయులును రూబే నీయులును అందరు యెహో వా సన్నిధిని యుద్ధమునకు సిద్దపడి మీతో కూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందు దురనగా గాదీయులును రూబేనీయులునుయెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తర మిచ్చిరి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టు కొనిరి. రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
- Genesis 46:16 ఆదికాండము 46:16గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.