Job · chapter 12 · verse 9
Job 12:9 in Telugu
వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?
Veeti annitini batti yochinchukonina yedala yehovaa hastamu veetini kalugajesenani telisikonaleni vaadevadu?
Job 12:9 in English
- King James Version (KJV)
- Who knoweth not in all these that the hand of the LORD hath wrought this?
- World English Bible (WEB)
- Who doesn’t know that in all these, the LORD’s hand has done this,
- American Standard Version (ASV)
- Who knoweth not in all these, That the hand of Jehovah hath wrought this,
- Bible in Basic English (BBE)
- Who does not see by all these that the hand of the Lord has done this?
- Darby Translation (DBY)
- Who knoweth not in all these, that the hand of Jehovah hath wrought this?
- Webster's Bible (WBS)
- Who knoweth not in all these that the hand of the LORD hath wrought this?
- Young's Literal Translation (YLT)
- 'Who hath not known in all these, That the hand of Jehovah hath done this?
Read in context
- 7అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును.
- 8భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును
- 9వీటి అన్నిటిని బట్టి యోచించుకొనిన యెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేని వాడెవడు?
- 10జీవరాసుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలును ఆయన వశమున నున్నవి గదా.
- 11అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?
Cross references
- Isaiah 41:20 యెషయా 41:20నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటిం చెదను అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.
- Jeremiah 27:5–6 యిర్మీయా 27:5–6అధిక బలముచేతను చాచిన బాహువుచేతను భూమిని భూమిమీదనున్న నరులను జంతువులను నేనే సృజించి, ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే యిచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను; అతని సేవించుటకై భూజంతువులనుకూడ అతని వశము చేయుచున్నాను.
- Romans 11:36 రోమీయులకు 11:36ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
- 1 Samuel 2:7 1 సమూయేలు 2:7యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.
- Daniel 9:17 దానియేలు 9:17ఇప్పుడైతే మా దేవా, దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలముమీదికి నీ ముఖప్రకాశము రానిమ్ము.
- Acts 19:35 అపొస్తలుల కార్యములు 19:35అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?
- Deuteronomy 8:17–18 ద్వితీయోపదేశకాండము 8:17–18అయితే మీరుమా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొన వలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే.
- James 2:5–7 యాకోబు 2:5–7నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చు చున్న వారు వీరే గదా? మీకు పెట్టబడిన శ్రేష్ఠమైన నామమును దూషించువారు వీరే గదా?
- Daniel 5:18 దానియేలు 5:18రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను.
- Job 12:3 యోబు 12:3అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగియున్నది నేను మీకంటె తక్కువజ్ఞానము కలవాడను కాను మీరు చెప్పినవాటిని ఎరుగనివాడెవడు? దేవునికి మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
- Job 22:18 యోబు 22:18మాయొద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై యుండునుగాక.