Job · chapter 22 · verse 30
Job 22:30 in Telugu
నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
Nirdoshikaanivaaninainanu aayana vidipinchunu. Atadu nee chetula shuddhivalana vidipimpabadunu.
Job 22:30 in English
- King James Version (KJV)
- He shall deliver the island of the innocent: and it is delivered by the pureness of thine hands.
- World English Bible (WEB)
- He will even deliver him who is not innocent. Yes, he will be delivered through the cleanness of your hands.”
- American Standard Version (ASV)
- He will deliver [even] him that is not innocent: Yea, he shall be delivered through the cleanness of thy hands.
- Bible in Basic English (BBE)
- He makes safe the man who is free from sin, and if your hands are clean, salvation will be yours.
- Darby Translation (DBY)
- [Even] him that is not innocent shall he deliver; yea, he shall be delivered by the pureness of thy hands.
- Webster's Bible (WBS)
- He shall deliver the island of the innocent: and it is delivered by the pureness of thy hands.
- Young's Literal Translation (YLT)
- He delivereth the not innocent, Yea, he hath been delivered By the cleanness of thy hands.
Read in context
- 28మరియు నీవు దేనినైన యోచనచేయగా అది నీకుస్థిరపరచబడునునీ మార్గములమీద వెలుగు ప్రకాశించును.
- 29నీవు పడద్రోయబడినప్పుడుమీదు చూచెదనందువువినయముగలవానిని ఆయన రక్షించును.
- 30నిర్దోషికానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధివలన విడిపింపబడును.
Cross references
- Job 42:7–8 యోబు 42:7–8యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితుల మీదనుమండుచున్నది కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైనయోబు మీ నిమిత్తము ప్రార్థనచేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుక లేదు.
- James 5:15–16 యాకోబు 5:15–16విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- Psalm 18:20 కీర్తనలు 18:20నా నీతినిబట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
- Genesis 18:26–32 ఆదికాండము 18:26–32యెహోవా సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదుగురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; అతడింక ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందిని బట్టి నాశనము చేయకయుందుననెను.
- Acts 27:24 అపొస్తలుల కార్యములు 27:24నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
- Malachi 1:9 మలాకీ 1:9దేవుడు మనకు కటా క్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి; మీ చేతనే గదా అది జరిగెను. ఆయన మిమ్మునుబట్టి యెవరినైన అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
- Matthew 17:19–20 మత్తయి 17:19–20తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చిమేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి. అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;
- Psalm 24:4 కీర్తనలు 24:4వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
- Acts 19:15–16 అపొస్తలుల కార్యములు 19:15–16అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.
- Jeremiah 5:1 యిర్మీయా 5:1యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలిసికొనుడి; దాని రాజవీధులలో విచారణ చేయుడి; న్యాయము జరిగించుచు నమ్మకముగానుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడినయెడల నేను దాని క్షమించుదును.
- Isaiah 58:12 యెషయా 58:12పూర్వకాలమునుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడినదానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడ వనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
- Isaiah 1:15 యెషయా 1:15మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.