Leviticus · chapter 15 · verse 20
Leviticus 15:20 in Telugu
ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.
Aame kadagaa unnappudu aame denimeeda pandukonuno adi apavitramagunu; aame denimeeda koorchunduno adi apavitramagunu.
Leviticus 15:20 in English
- King James Version (KJV)
- And every thing that she lieth upon in her separation shall be unclean: every thing also that she sitteth upon shall be unclean.
- World English Bible (WEB)
- “‘Everything that she lies on in her impurity shall be unclean. Everything also that she sits on shall be unclean.
- American Standard Version (ASV)
- And everything that she lieth upon in her impurity shall be unclean: everything also that she sitteth upon shall be unclean.
- Bible in Basic English (BBE)
- And everything on which she has been resting, while she is kept separate, will be unclean, and everything on which she has been seated will be unclean.
- Darby Translation (DBY)
- And everything that she lieth upon in her separation shall be unclean; and everything that she sitteth upon shall be unclean.
- Webster's Bible (WBS)
- And every thing that she lieth upon in her separation shall be unclean: every thing also that she sitteth upon shall be unclean.
- Young's Literal Translation (YLT)
- 'And anything on which she lieth in her separation is unclean, and anything on which she sitteth is unclean;
Read in context
- 18వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులై యుందురు.
- 19స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.
- 20ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.
- 21ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును.
- 22ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.
Cross references
- Leviticus 15:4–9 లేవీయకాండము 15:4–9వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయం కాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును. స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
- 1 Corinthians 15:33 1 కొరింథీయులకు 15:33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.
- Proverbs 22:27 సామెతలు 22:27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
- Proverbs 2:16–19 సామెతలు 2:16–19మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును. అట్టి స్త్రీ తన ¸యౌవనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల
- Proverbs 6:35 సామెతలు 6:35ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.
- Proverbs 6:24 సామెతలు 6:24చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును.
- Proverbs 7:10–27 సామెతలు 7:10–27అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను. నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
- Ecclesiastes 7:26 ప్రసంగి 7:26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
- Proverbs 9:13–18 సామెతలు 9:13–18బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు. అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును. అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నారనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.
- Proverbs 5:3–13 సామెతలు 5:3–13జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లినయెడల పరులకు నీ ¸యౌవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు