Malachi · chapter 1 · verse 5
Malachi 1:5 in Telugu
కన్ను లార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.
Kannu laara daanini choochi ishraayeleeyula sarihaddulalo yehovaa bahu ghanudugaa unnaadani meeranduru.
Malachi 1:5 in English
- King James Version (KJV)
- And your eyes shall see, and ye shall say, The LORD will be magnified from the border of Israel.
- World English Bible (WEB)
- Your eyes will see, and you will say, “The LORD is great—even beyond the border of Israel!”
- American Standard Version (ASV)
- And your eyes shall see, and ye shall say, Jehovah be magnified beyond the border of Israel.
- Bible in Basic English (BBE)
- And your eyes will see it; and you will say, The Lord is great even outside the limits of Israel.
- Darby Translation (DBY)
- And your eyes shall see [it], and ye shall say, Jehovah is magnified beyond the border of Israel.
- Webster's Bible (WBS)
- And your eyes shall see, and ye shall say, The LORD will be magnified from the border of Israel.
- Young's Literal Translation (YLT)
- And your eyes do see, and ye say, 'Magnified is Jehovah beyond the border of Israel,
Read in context
- 3ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్య మందున్న నక్కల పాలు చేసితిని.
- 4మనము నాశనమైతివిు, పాడైన మన స్థలములను మరల కట్టుకొందము రండని ఎదోమీ యులు అనుకొందురు; అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగావారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును; లోకులువారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్యకోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు.
- 5కన్ను లార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు.
- 6కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
- 7నా బలి పీఠముమీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపుబల్లను నీచపరచినందుచేతనే గదా
Cross references
- Deuteronomy 11:7 ద్వితీయోపదేశకాండము 11:7యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా.
- Luke 10:23–24 లూకా 10:23–24అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి - మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.
- Psalm 83:17–18 కీర్తనలు 83:17–18వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
- Psalm 35:26–27 కీర్తనలు 35:26–27నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
- Psalm 58:10–11 కీర్తనలు 58:10–11ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతో షించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగు ననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు.
- Ezekiel 38:16 యెహెజ్కేలు 38:16మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.
- 2 Chronicles 29:8 2 దినవృత్తాంతములు 29:8అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూ షలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయ మునకును నిందకును ఆస్పదముగాచేసెను.
- 1 Samuel 12:16 1 సమూయేలు 12:16మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.
- Joshua 24:7 యెహోషువ 24:7వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.
- Ezekiel 38:23 యెహెజ్కేలు 38:23నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.
- Micah 5:4 మీకా 5:4ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, ఆయన భూమ్యంతములవరకు ప్రబలుడగును,
- Deuteronomy 4:3 ద్వితీయోపదేశకాండము 4:3బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.