Proverbs · chapter 1 · verse 11
Proverbs 1:11 in Telugu
మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
Maatokooda rammu manamu praanamuteeyutakai ponchiyundamu nirdoshiyaina yokani pattukonutaku daagiyundamu
Proverbs 1:11 in English
- King James Version (KJV)
- If they say, Come with us, let us lay wait for blood, let us lurk privily for the innocent without cause:
- World English Bible (WEB)
- If they say, “Come with us. Let’s lie in wait for blood. Let’s lurk secretly for the innocent without cause.
- American Standard Version (ASV)
- If they say, Come with us, Let us lay wait for blood; Let us lurk privily for the innocent without cause;
- Bible in Basic English (BBE)
- If they say, Come with us; let us make designs against the good, waiting secretly for the upright, without cause;
- Darby Translation (DBY)
- If they say, Come with us, let us lay wait for blood, let us lurk secretly for the innocent without cause;
- Webster's Bible (WBS)
- If they say, Come with us, let us lay wait for blood, let us lurk privily for the innocent without cause:
- Young's Literal Translation (YLT)
- If they say, 'Come with us, we lay wait for blood, We watch secretly for the innocent without cause,
Read in context
- 9అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
- 10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
- 11మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై పొంచియుందము నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
- 12పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
- 13పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము
Cross references
- Proverbs 1:18 సామెతలు 1:18వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.
- Proverbs 12:6 సామెతలు 12:6భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
- Jeremiah 5:26 యిర్మీయా 5:26నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు.
- Acts 25:3 అపొస్తలుల కార్యములు 25:3మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.
- Jeremiah 18:18–20 యిర్మీయా 18:18–20అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని విన కుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి. యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
- Psalm 17:12 కీర్తనలు 17:12వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు.
- Micah 7:2 మీకా 7:2భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.
- Psalm 56:6 కీర్తనలు 56:6వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.
- Psalm 35:7 కీర్తనలు 35:7నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
- Matthew 26:3–4 మత్తయి 26:3–4ఆ సమయమున ప్రధానయాజకులును ప్రజల పెద్దలును కయప అను ప్రధానయాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
- Psalm 64:5–6 కీర్తనలు 64:5–6వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నింతురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము.
- Proverbs 1:16 సామెతలు 1:16కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.