Proverbs · chapter 1 · verse 7
Proverbs 1:7 in Telugu
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
Yehovaayandu bhayabhaktulu kaligiyunduta teliviki moolamu moorkhulu jnyaanamunu upadeshamunu tiraskarinchuduru.
Proverbs 1:7 in English
- King James Version (KJV)
- The fear of the LORD [is] the beginning of knowledge: [but] fools despise wisdom and instruction.
- World English Bible (WEB)
- The fear of the LORD is the beginning of knowledge, but the foolish despise wisdom and instruction.
- American Standard Version (ASV)
- The fear of Jehovah is the beginning of knowledge; [But] the foolish despise wisdom and instruction.
- Bible in Basic English (BBE)
- The fear of the Lord is the start of knowledge: but the foolish have no use for wisdom and teaching.
- Darby Translation (DBY)
- The fear of Jehovah is the beginning of knowledge: fools despise wisdom and instruction.
- Webster's Bible (WBS)
- The fear of the LORD [is] the beginning of knowledge: [but] fools despise wisdom and instruction.
- Young's Literal Translation (YLT)
- Fear of Jehovah [is] a beginning of knowledge, Wisdom and instruction fools have despised!
Read in context
- 5జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
- 6వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.
- 7యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
- 8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
- 9అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
Cross references
- Job 28:28 యోబు 28:28మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
- Proverbs 9:10 సామెతలు 9:10యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
- Ecclesiastes 12:13 ప్రసంగి 12:13ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
- Proverbs 15:33 సామెతలు 15:33యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.
- Proverbs 18:2 సామెతలు 18:2తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
- Proverbs 1:29–30 సామెతలు 1:29–30జ్ఞానము వారికి అసహ్యమాయెను యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి కిష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
- Proverbs 1:22 సామెతలు 1:22ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు కొందురు?
- Romans 1:28 రోమీయులకు 1:28మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
- Proverbs 15:5 సామెతలు 15:5మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
- John 3:18–21 యోహాను 3:18–21ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
- Proverbs 5:12–13 సామెతలు 5:12–13అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు