Proverbs · chapter 19 · verse 27
Proverbs 19:27 in Telugu
నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
Naa kumaarudaa, telivi puttinchu maatalu neevu meeragoritivaa? Upadeshamu vinuta ika maanukonumu.
Proverbs 19:27 in English
- King James Version (KJV)
- Cease, my son, to hear the instruction [that causeth] to err from the words of knowledge.
- World English Bible (WEB)
- If you stop listening to instruction, my son, you will stray from the words of knowledge.
- American Standard Version (ASV)
- Cease, my son, to hear instruction [Only] to err from the words of knowledge.
- Bible in Basic English (BBE)
- A son who no longer gives attention to teaching is turned away from the words of knowledge.
- Darby Translation (DBY)
- Cease, my son, to hear the instruction which causeth to stray from the words of knowledge.
- Webster's Bible (WBS)
- Cease, my son, to hear the instruction [that causeth] to err from the words of knowledge.
- Young's Literal Translation (YLT)
- Cease, my son, to hear instruction — To err from sayings of knowledge.
Read in context
- 25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
- 26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
- 27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
- 28వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
- 29అపహాసకులకు తీర్పులును బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.
Cross references
- 1 Timothy 6:3–5 1 తిమోతికి 6:3–5ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును, చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
- Mark 4:24 మార్కు 4:24మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
- Proverbs 14:7 సామెతలు 14:7బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?
- 1 John 4:1 1 యోహాను 4:1ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
- Matthew 7:15 మత్తయి 7:15అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
- 2 Corinthians 11:13–15 2 కొరింథీయులకు 11:13–15ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
- 2 John 1:10 2 యోహాను 1:10ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
- John 10:5 యోహాను 10:5అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
- 1 Timothy 4:7 1 తిమోతికి 4:7అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.
- Deuteronomy 13:1–4 ద్వితీయోపదేశకాండము 13:1–4ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజిం తము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయము తోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను.
- 2 Peter 2:1–2 2 పేతురు 2:1–2మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.
- Matthew 16:12 మత్తయి 16:12అప్పుడు రొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.