Proverbs · chapter 21 · verse 11
Proverbs 21:11 in Telugu
అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
Apahaasakudu dandimpabaduta choochi jnyaanamu leni vaadu jnyaanamu pondunu jnyaanamugalavaadu upadeshamuvalana telivinondunu.
Proverbs 21:11 in English
- King James Version (KJV)
- When the scorner is punished, the simple is made wise: and when the wise is instructed, he receiveth knowledge.
- World English Bible (WEB)
- When the mocker is punished, the simple gains wisdom. When the wise is instructed, he receives knowledge.
- American Standard Version (ASV)
- When the scoffer is punished, the simple is made wise; And when the wise is instructed, he receiveth knowledge.
- Bible in Basic English (BBE)
- When the man of pride undergoes punishment, the simple man gets wisdom; and by watching the wise he gets knowledge.
- Darby Translation (DBY)
- When the scorner is punished, the simple becometh wise; and when the wise is instructed, he receiveth knowledge.
- Webster's Bible (WBS)
- When the scorner is punished, the simple is made wise: and when the wise is instructed, he receiveth knowledge.
- Young's Literal Translation (YLT)
- When the scorner is punished, the simple becometh wise, And in giving understanding to the wise He receiveth knowledge.
Read in context
- 9గయ్యాళితో పెద్దయింట నుండుటకంటె మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు.
- 10భక్తిహీనుని మనస్సు కీడుచేయ గోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు.
- 11అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానముగలవాడు ఉపదేశమువలన తెలివినొందును.
- 12నీతిమంతుడైన వాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కని పెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
- 13దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.
Cross references
- Proverbs 19:25 సామెతలు 19:25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
- Proverbs 18:15 సామెతలు 18:15జ్ఞానుల చెవి తెలివిని వెదకును వివేకముగల మనస్సు తెలివిని సంపాదించును.
- Acts 5:5 అపొస్తలుల కార్యములు 5:5అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;
- Proverbs 9:9 సామెతలు 9:9జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
- Proverbs 18:1 సామెతలు 18:1వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
- Deuteronomy 21:21 ద్వితీయోపదేశకాండము 21:21అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
- Psalm 64:7–9 కీర్తనలు 64:7–9దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు
- 1 Corinthians 10:6–11 1 కొరింథీయులకు 10:6–11వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి. మీరు సణుగకుడి; వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
- Proverbs 1:5 సామెతలు 1:5జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
- Numbers 16:34 సంఖ్యాకాండము 16:34వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష వినిభూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.
- Hebrews 2:1–3 హెబ్రీయులకు 2:1–3కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై,
- Deuteronomy 13:11 ద్వితీయోపదేశకాండము 13:11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.