Proverbs · chapter 8 · verse 33
Proverbs 8:33 in Telugu
ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
Upadeshamunu niraakarimpaka daani navalambinchi jnyaanulai yundudi.
Proverbs 8:33 in English
- King James Version (KJV)
- Hear instruction, and be wise, and refuse it not.
- World English Bible (WEB)
- Hear instruction, and be wise. Don’t refuse it.
- American Standard Version (ASV)
- Hear instruction, and be wise, And refuse it not.
- Bible in Basic English (BBE)
- Take my teaching and be wise; do not let it go.
- Darby Translation (DBY)
- hear instruction and be wise, and refuse it not.
- Webster's Bible (WBS)
- Hear instruction, and be wise, and refuse it not.
- Young's Literal Translation (YLT)
- Hear instruction, and be wise, and slight not.
Read in context
- 31ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.
- 32కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
- 33ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
- 34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
- 35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
Cross references
- Proverbs 4:1 సామెతలు 4:1కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
- Psalm 81:11–12 కీర్తనలు 81:11–12అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచు కొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని.
- Proverbs 1:8 సామెతలు 1:8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
- Proverbs 5:1 సామెతలు 5:1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
- Romans 10:16–17 రోమీయులకు 10:16–17అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.
- Proverbs 1:2–3 సామెతలు 1:2–3జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును
- Hebrews 12:25 హెబ్రీయులకు 12:25మీకు బుద్ధి చెప్పుచున్నవానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమిమీదనుండి బుద్ధిచెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినయెడల, పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయముగదా.
- Proverbs 1:21 సామెతలు 1:21గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయు చున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది
- Isaiah 55:1–3 యెషయా 55:1–3దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదానికొరకు మీ రేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
- Acts 7:35–37 అపొస్తలుల కార్యములు 7:35–37అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకునిగాను నియమించి పంపెను ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరు లలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.